
📌 Key Points
- హోలీ వేడుకలో అనసూయను ‘ఆంటీ’ అని పిలిచినందుకు ట్రోల్స్.
- సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించిన అనసూయ.
- వయసు ఆధారంగా మహిళలను తక్కువ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనసూయ.
- తన కష్టాలు, అవమానాలను గుర్తు చేసుకున్న అనసూయ.
యాంకర్ అనసూయ భరద్వాజ్ హోలీ వేడుకలో ఆంటీ ట్రోల్స్‌కు గురయ్యారు. దీనిపై ఆమె సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. వయసు ఆధారంగా మహిళలను కించపరచడాన్ని ఆమె ఖండించారు.
హోలీ వేడుకలో అనసూయకు ఎదురైన ఆంటీ ట్రోల్స్
Anasuya Bhardwaj: టాలీవుడ్ సెన్సేషనల్ యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj) మరోసారి సోషల్ మీడియా వార్తలలో నిలిచారు. బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ పలు సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.. ఇక తన గురించి ఎవరైనా ఏదైనా విమర్శలు కురిపిస్తే వారికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇస్తూ ఉంటారు.
ఇదిలా ఉండగా హోలీ పండుగ సందర్భంగా అనసూయ ఓ కార్యక్రమానికి హాజరు కావడంతో అక్కడ కొంతమంది ఆకతాయిలు అనసూయ మాట్లాడుతున్న సమయంలో “ఆంటీ” (Aunty)అంటూ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. గతంలో ఆంటీ అనే విమర్శలపై ఈమె స్పందిస్తూ పోలీసులను కూడా ఆశ్రయించడంతో ఎక్కడికి వెళ్లినా అనసూయకు ఇలాంటి కామెంట్లు ఎదురవుతూనే ఉన్నాయి. హోలీ పండుగ సందర్భంగా ఈమె పట్ల ఆంటీ ట్రోల్స్ రావడంతో అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
సోషల్ మీడియాలో అనసూయ ఘాటు స్పందన
ఈ క్రమంలోనే అనసూయ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయంపై స్పందిస్తూ.. ఒకరిని బాధ పెడుతూ ఆనందం పొందే వారిని చూస్తే జాలి వేస్తుంది. మహిళ గురించి మాట్లాడుతూ వారి వయసును బట్టి తక్కువ చేయటం సభ్య సమాజ లక్షణం కాదు. అలా చేస్తున్న వారిని చూసి సమాజం కూడా సిగ్గుపడుతుందని, ఇలాంటి వాటిని చూసి మనకెందుకులే అంటూ వదిలేయకూడదని అలా చేస్తే మానవత్వాన్ని పూర్తిగా కోల్పోతామని తెలిపారు. ఇలాంటి విషయాల గురించి నేను ఎవరికి భయపడను, ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతానంటూ తనదైన శైలిలోనే తన అభిప్రాయాలను తెలిపారు.నేను ఇండస్ట్రీలో ఈ స్థాయిలోకి వచ్చాను అంటే దాని వెనుక ఎన్నో అడ్డంకులు, అవమానాలు ఉన్నాయని వాటిని ఎదుర్కొని నేను ఈ స్థాయిలో ఉండటం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.
విమర్శలు చేయటానికి మీరెవరు?
విమర్శకులకు అనసూయ స్ట్రాంగ్ కౌంటర్
ఇలా కష్టపడి పని చేసుకుని జీవితంలో ఎదుగుతున్న వారి పట్ల విమర్శలు చేయటానికి మీరెవరు అంటూ తన గురించి వచ్చినటువంటి కామెంట్లపై అనసూయ ఘాటుగా స్పందిస్తూ ట్రోలర్స్ కు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ విషయంపై అనసూయకు పెద్ద ఎత్తున పలువురు మద్దతు తెలుపుతూ కామెంట్లు చేయగా మరికొందరు అనసూయ తీరుపై యధావిధిగా విమర్శలు కురిపిస్తున్నారు. ఇక అనసూయ తరచు ఇలాంటి విషయాలలో స్పందిస్తూ సోషల్ మీడియా వార్తలలో నిలుస్తూ ఉన్నారు. తన గురించి ఎవరు ఎన్ని విమర్శలు చేసిన తన అభిప్రాయాన్ని మాత్రం ఈమె నిర్మొహమాటంగా చెబుతారనే సంగతి తెలిసిందే. తద్వారానే విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు.
Alsom Read: Divvala Madhuri: తిరుమల వివాదం దివ్వెల మాధురి తనూజ పై కేసు నమోదు ..
అనసూయ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, అవమానాలను గుర్తు చేసుకుంటూ, విమర్శకులకు గట్టిగా సమాధానం ఇచ్చారు. ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


