
టాలీవుడ్ నటి అనసూయ ఇంట్లో మరో శుభకార్యం జరిగింది. ఆమె కుమారుడు శౌర్య భరద్వాజ్‌కు ఉపనయనం వేడుక ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి రోజున జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Key Points
అనసూయ కుమారుడు శౌర్య భరద్వాజ్‌కు ఉపనయనం.
హనుమాన్ జయంతి రోజున ఈ శుభకార్యం జరిగింది.
ఇటీవలే నూతన గృహ ప్రవేశం చేసిన అనసూయ.
శౌర్య భరద్వాజ్ ఉపనయనం
టాలీవుడ్ నటి అనసూయ ఇంట మరో వేడుక జరిగింది. ఇటీవలే నూతన గృహ ప్రవేశం చేసిన అనసూయ.. తాజాగా తన పెద్ద కుమారుడికి ఉపనయనం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా తన కుమారుడు శౌర్య భరద్వాజ్‌కు సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకను జరుపుకున్నారు. ఉపనయనం అంటే మన ఆధ్యాత్మిక పద్ధతులను పాటించండం, వైదిక సంప్రదాయంలో ప్రకారం ఉపనయన వేడుకలో శరీరంపై యజ్ఞోపవీతం (పవిత్ర దారం) ధరిస్తారు. ఈ వేడుకకు సంబంధించిన వేడుకను అనసూయ తన ఇన్‌స్టాలో పంచుకుంది.
అనసూయ సోషల్ మీడియా పోస్ట్
అనసూయ తన ఇన్‌స్టాలో రాస్తూ..’నా పెద్ద కొడుకు ప్రియమైన శౌర్యభరద్వాజ్.. నీకు ఈ అధికారిక వేడుక అవసరం లేదని నేను ఎప్పుడూ అనుకోలేదు.. కానీ ఈరోజు నీ ఉపనయనం వేడుకతో నీ తల్లిదండ్రులుగా, కుటుంబంగా మేమంతా కలిసి ఆధ్యాత్మిక పునర్జన్మలోకి అడుగుపెట్టాం. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలు, సూత్రాలు, జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా.. మన సాంస్కృతిని కొనసాగించేలా వాగ్దానాన్ని తీసుకున్నాం. నువ్వు మన సంప్రదాయాలను సజీవంగా ఉంచడానికి మాకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. ఆ హనుమాన్ జీ శక్తి నిన్ను ఎల్లప్పుడూ నీతి మార్గంలో నడిపిస్తుంది’ అంటూ పోస్ట్ చేసింది. ఇవాళ హనుమాన్ జయంతి కావడంతో అనసూయ ఈ శుభకార్యం చేపట్టినట్లు తెలుస్తోంది.
నూతన గృహ ప్రవేశం తర్వాత మరో శుభకార్యం
కాగా.. ఇటీవలే టాలీవుడ్ స్టార్ నటి అనసూయ ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసింది. తన జీవితంలో మరో కొత్త అధ్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంది. అంతేకాకుండా తన కలల సౌధానికి శ్రీరామసంజీవని అని పేరు కూడా పెట్టింది. ఈ సంతోషకర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తన కొత్త ఇంటిలో జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వివరిస్తూ అనసూయ పోస్ట్ చేసింది. ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమాలైన హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం గురించి వివరిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. మా ఇంటికి సంజీవని అని పేరు పెట్టాలనుకున్నామని.. కానీ గురువు(పూజారి) సూచనలతో శ్రీరామసంజీవని అని పెట్టుకున్నామని తెలిపింది. ఆ రోజే మా ఇంటికి ఆంజనేయుడు వచ్చాడని గురువు తన ఫోన్‌లో ఫోటోను చూపించారని భావోద్వేగానికి గురైంది.
అనసూయ కుటుంబం ఈ శుభకార్యంతో సంతోషంగా ఉంది. తమ సంప్రదాయాలను పాటిస్తూ, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకుంటున్నారని అనసూయ తెలిపింది.


