
📌 Key Points
- అనసూయ శారీ ఫోటోలకు నెటిజన్ వల్గర్ కామెంట్.
- “నలిపేయాలి” అంటూ దారుణమైన వ్యాఖ్య చేసిన ఆకతాయి.
- నిధి ఘటనను గుర్తుచేస్తూ అనసూయ తీవ్ర స్పందన.
- తెలంగాణ పోలీస్, సైబర్ క్రైమ్‌ను ట్యాగ్ చేసి చర్యలకు డిమాండ్.
సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్ ఎక్కువవుతున్నాయి. తాజాగా యాంకర్ అనసూయ భరద్వాజ్ శారీ ఫోటోలపై ఓ నెటిజన్ దారుణమైన వ్యాఖ్య చేశాడు. ఈ విషయంపై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అనసూయపై దారుణమైన వల్గర్ కామెంట్
Anasuya Bharadwaj: సోషల్ మీడియాలో నెగిటీవ్ కామెంట్స్ ఎక్కువవుతున్నాయి. సెలబ్రెటీలు టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు మనల్ని పట్టించుకోరు అనే రీతిలో ఎవరికీ ఇష్టంవచ్చినట్టుగా వాళ్ళు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంత పట్టించుకోకుండా ఉన్నప్పటికీ కొన్ని కామెంట్స్ శృతి మించుతుండటంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినా కూడా ఏమాత్రం మారడం లేదు కొంతమంది ఆకతాయిలు. మరీ ముఖ్యంగా లేడీ సెలబ్రెటీలు టార్గెట్ గా వల్గర్ కామెంట్స్ చేస్తూ శుకానందాన్ని పొందుతున్నారు. తాజాగా మరో నెటిజన్స్ యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj)పై దారుణమైన కామెంట్ చేశాడు.
సైబర్ క్రైమ్‌కు అనసూయ ట్యాగ్
దానికి అనసూయ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. రీసెంట్ గా అనసూయ శారీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి, ఒక నెటిజన్స్ కామెంట్ చేస్తూ “మొన్న నిధి పాపను నలిపేసినట్టు.. నిన్ను కూడా నలిపేయాలి” అంటూ వల్గర్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కి రియాక్ట్ అయిన అనసూయ సీరియస్ అయ్యింది. “ఇలాంటి వాళ్ళని ఎం చేయాలి. ఆరోజు పాపం నిధిని చూస్తే నాకే బాధేసింది. తెలంగాణ పోలీస్ కాస్త గమనించండి. వెంటనే యాక్షన్ తీసుకోండి”అంటూ తెలంగాణ పోలీస్, సైబర్ క్రైం పోలీస్ లను ట్యాగ్ చేసింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై వల్గర్ కామెంట్స్ పెరుగుతున్న తరుణంలో, అనసూయ స్పందన చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. ఇటువంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తుంది.
