
📌 Key Points
- ‘7/G బృందావన్ కాలనీ 2’లో అనస్వర రాజన్ హీరోయిన్‌గా ఫిక్స్, రవికృష్ణ హీరో!
- యువన్ శంకర్ రాజా సంగీతం, ఏ.ఎం. రత్నం నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది.
- షూటింగ్ 60% పూర్తి! జూలై లేదా ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు!
- సెల్వరాఘవన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు!
టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక అదిరిపోయే న్యూస్! ఒకప్పుడు ట్రెండ్ సృష్టించిన 7/G బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఈ సీక్వెల్ లో హీరోయిన్ ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
అనస్వర రాజన్ కు బంపర్ ఆఫర్!
7/G Brundavan Colony 2; ‘ఛాంపియన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది మలయాళ కుట్టి అనస్వర రాజన్. రోషన్ మేక హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో అనస్వర రాజన్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఈ అమ్మడుకు కెరీర్‌లో ఊహించని బంపర్ ఆఫర్ దక్కించుకుందట. సౌత్ ఇండియాలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ‘7/G బృందావన్ కాలనీ’ చిత్రానికి సీక్వెల్ గా ‘7/G బృందావన్ కాలనీ 2(7/G Brundavan Colony 2)’ వస్తున్న విషయం తెలిసిందే.
ఈ ప్రెస్టీజియస్ సినిమాలో కథానాయికగా అనస్వర రాజన్ ఎంపికైందట. 7/G బృందావన్ కాలనీ కల్ట్ క్లాసిక్ సినిమాను తెరకెక్కించిన సెన్సేషనల్ డైరెక్టర్ సెల్వరాఘవన్ ఈ సీక్వెల్‌ను కూడా రూపొందిస్తుండటంతో సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. సుమారు రెండు దశాబ్దాల విరామం తర్వాత ఈ ప్రేమకథకు కొనసాగింపు వస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సీక్వెల్ లో రవికృష్ణ, సంగీతం యువన్!
మొదటి భాగంలో హీరోగా నటించిన రవికృష్ణే ఈ సీక్వెల్‌లోనూ హీరోగా నటిస్తుండగా, అనస్వర రాజన్ కొత్త హీరోయిన్‌గా మెరవనుంది. ఇప్పటికే, అనస్వరకి సంబంధించిన టెస్ట్ షూట్ కూడా జరిగిందని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. అయితే, కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి ప్రాజెక్టులో భాగం కావడం నిజంగా గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు.
జూలైలో విడుదల! భారీ అంచనాలు!!
ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తవగా.. జూలై లేదా ఆగస్టులో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి చాలా కాలం గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ కల్ట్ క్లాసిక్ సీక్వెల్ మళ్ళీ ఆ రేంజ్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.
చాలా కాలం తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


