
టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల తన సుదీర్ఘ కెరీర్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ప్రాణ భయంతో కిటికీలోంచి దూకి పారిపోయిన చేదు అనుభవాలను ఆమె పంచుకున్నారు.
Key Points
యాంకర్ సుమ కెరీర్ 1991లో మొదలై, 2006లో బ్రేక్ లభించింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్లలో అభిమానుల తాకిడిని తరచుగా ఎదుర్కొంటుంది.
ఆంధ్రావాలా ఆడియో లాంచ్ ఓ చేదు అనుభవంగా గుర్తుంచుకుంది.
పవన్ కళ్యాణ్ ఈవెంట్లలో రెండుసార్లు కిటికీలోంచి దూకి తప్పించుకుంది.
సుమ కనకాల కెరీర్ ప్రస్థానం
టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా సుమ కనకాల కొనసాగుతున్నారు. టాలీవుడ్ జరిగే దాదాపు ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె ఉంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో యాంకర్ గా ఆమెకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఫ్యాన్స్ ని హుషారెత్తించేలా హీరోలకు ఎలివేషన్స్ ఇస్తూ, మధ్యలో జోకులు వేస్తూ, సందర్భానుసారం మాట్లాడుతూ సరదాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సుమ నడిపిస్తుంది. ఆమెకి ఉన్న క్రేజ్ చూసి నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కోసం ఆమెకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు.
సుమ భర్త రాజీవ్ కనకాల దశాబ్దాలుగా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. సుమ కొడుకు రోషన్ కూడా ఇటీవల హీరోగా లాంచ్ అయ్యాడు. సుమ కనకాల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో తనకి ఎదురైనా చేదు అనుభవాల గురించి మాట్లాడారు. సుమ మాట్లాడుతూ.. ”నేను కెరీర్ ప్రారంభించింది 1991లో. నాకు ఫస్ట్ బ్రేక్ వచ్చింది 2006లో. ఎక్కడ 1991… ఎక్కడ 2006. కొంతమంది జూనియర్లు రెండు నెలలు, మూడు నెలలు, లేదా ఏడాది ట్రై చేసి మాకు అవకాశాలు రావడం లేదు అంటూ వెనక్కి వెళ్లిపోతుంటారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఎదురైన సవాళ్లు
ఎవ్వరైనా సహనంతో ఉంటేనే సక్సెస్ వస్తుంది. 2006లో ఓ ఛానల్ లో అవాక్కయ్యారా ? అనే షో చేశాను. అదే నా కెరీర్ కి టర్నింగ్ పాయింట్. ఫోన్ కాల్, ఎస్ ఎమ్ ఎస్ ద్వారా జరిగే షో అది. దీనితో కొన్ని వేలమంది ఆ షోకి కాల్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దెబ్బకి ఛానల్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడే రియలైజ్ అయ్యా.. ఇదే నా ఫస్ట్ సక్సెస్ అని” అంటూ సుమన్ తెలిపింది. ఆంధ్రావాలా ఆడియో లాంచ్ నాకొక చేదు అనుభవం. ఆ ఈవెంట్ కి కొన్ని లక్షల మంది హాజరయ్యారు. నాలుగు ట్రైన్లు వేశారు. ఓ ట్రైన్ కి నేను ఇంచార్జ్. ట్రైన్ దిగి ఈవెంట్ కి వెళ్లడం సాధ్యం కాలేదు.
న్ పేర్కొంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో చాలా జాగ్రత్తగా ఉంటాను. అభిమానుల తొక్కిసలాట పెరిగిన తర్వాత.. ముందుగా నా టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికని గమనిస్తారు. ఎమెర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది ? దూకి పారిపోవడానికి కిటికీలు ఎక్కుడ ఉన్నాయి ? అని అన్నీ గమనిస్తారు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయిపోగానే అభిమానులు ఓ ప్రవాహంలా వేదికపైకి దూసుకు వస్తారు. అలా పవన్ కళ్యాణ్ గారి సినిమాల ఈవెంట్స్ లో రెండుసార్లు కిటికీ దూకి పారిపోయాను.
ప్రాణ భయంతో సుమ సాహసం: కిటికీ దూకి పారిపోయిన వైనం
ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి గారి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని యాంకరింగ్ చేసినట్లు సుమ తెలిపారు. ఆ ఈవెంట్ కి వచ్చిన జనాల వాళ్ళ వేదిక ఊగిపోయింది. స్టేజీ ఎక్కడ కూలిపోతుందో అని టెన్షన్ పడ్డాను. ఒక దశలో నేను వేదిక దిగిపోతాను అని చెప్పినట్లు సుమన్ తెలిపారు.
యాంకర్ సుమ కనకాల తన కెరీర్ పట్ల అంకితభావాన్ని, అలాగే స్టార్ హీరోల ఈవెంట్లలో అభిమానుల తాకిడి వల్ల ఎదురయ్యే భద్రతా సవాళ్లను ఈ సంఘటనలు స్పష్టం చేస్తాయి. ఆమె ధైర్యం, వృత్తి నైపుణ్యం నిజంగా అభినందనీయం.


