|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏపీలో ఇళ్ల పండుగ: ఒకేరోజు 2.5 లక్షల గృహ ప్రవేశాలు!

Published: 29-03-2026, 8:35 PM
ఏపీలో ఇళ్ల పండుగ: ఒకేరోజు 2.5 లక్షల గృహ ప్రవేశాలు!
  • ఏపీలో ఒకేసారి 2.5 లక్షల గృహ ప్రవేశాలు
  • సూళ్లూరుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన, లబ్ధిదారులతో ముఖాముఖి
  • రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం
  • పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పీ4 వార్షికోత్సవ సభ

పేద ప్రజలందరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మరోసారి ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2.5 లక్షల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

రెండో విడత ఇళ్ల పంపిణీ ప్రారంభం

ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోన్న కూటమి ప్రభుత్వం మరోసారి సామూహిక గృహప్రవేశాల ద్వారా పేదలకు ఇళ్ల పంపిణీ చేపట్టనుంది. రెండో విడత ఇళ్ల పంపిణీలో భాగంగా ఇవాళ(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల గృహ ప్రవేశాలను ఘనంగా నిర్వహించనుంది.

తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో సోమవారం జరిగే సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తారు.

కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 21 నెలలో రెండోసారి ప్రభుత్వం ఇళ్ల పంపిణీ చేస్తోంది. గతేడాది నవంబర్‌లో రాయచోటి నుంచి 3 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అప్పగించింది. రెండో విడతలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడపేట మండలం, పుదూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష టిడ్కో ఇళ్లతో పాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు.

సూళ్లూరుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన

ఈ కార్యక్రమం అనంతరం పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పీ 4 కార్యక్రమం మొదలుపెట్టి ఏడాదవుతున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ 2.50 లక్షల గృహాల్లో.. 1.42 లక్షలు కాలనీల్లో చేపట్టిన గృహాలు కాగా.. మిగిలిన 1.08 లక్షలు టిడ్కో ఇళ్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి టిడ్కో గృహ సముదాయాల్లో చేపట్టిన 2.62 లక్షల గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11.50 గంటలకు పుదూరుకు చేరుకుంటారు. 11.55 గంటలకు లబ్ధిదారులతో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేయిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముచ్చటిస్తారు.

టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొంటారు. 02.40 గంటలకు సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం 04.35 గంటలకు తిరుపతి చేరుకుంటారు. 04.45 గంటలకు శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించే పీ4 వార్షికోత్సవ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగించుకుని రాత్రి 08.50 గంటలకు అమరావతి చేరుకుంటారు.

ఏపీ టౌన్ షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTIDCO) ఆధ్వర్యంలో ఈ ఇండ్ల నిర్మాణం జరిగింది. ఈ మెగా హౌసింగ్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.