|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీ.. ముహూర్తం ఖరారు!

Published: 24-03-2026, 6:15 AM
విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీ.. ముహూర్తం ఖరారు!
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటించనున్నారు.
  • ఈ సినిమా జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
  • కీర్తి సురేష్ హీరోయిన్‌గా ఎంపికైంది, మరో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది.
  • ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను విక్టరీ వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్‌లతో కలిసి చేయనున్నారు. ఇది మల్టీస్టారర్ సినిమాగా రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

అనిల్ రావిపూడి తదుపరి సినిమా వివరాలు

Anil Ravipudi: టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారితో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి తదుపరి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే అనిల్ రావిపూడి స్వయంగా తన తదుపరి సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు.

అనిల్ రావిపుడి ఇప్పుడు తన పదవ సినిమాని విక్టరీ వెంకటేష్(Venkatesh) అలాగే తనకు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన నటుడు కళ్యాణ్ రామ్(Kakyan Ram) తో సినిమా చేయబోతున్న విషయాన్ని ప్రకటించారు. ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం అనిల్ రావిపూడి స్క్రిప్ట్ పనులను పూర్తి చేస్తున్నారని త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభం కాబోతున్నట్టు ఇండస్ట్రీ సమాచారం.

విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో మల్టీస్టారర్

ఈ సినిమా కామెడీయాక్షన్ మేళవింపుతో అనిల్ తన స్టైల్‌లో స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా అనిల్ రావిపూడి కెరియర్ లో పదో సినిమా కావడంతో ఈ చిత్రంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి ఒక అద్భుతమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లకు సంబంధించి వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ముందుగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటించబోతున్నారనే వార్తలు రావడంతో ఎంతోమంది అనిల్ రావిపూడికి పూజ వద్దు అంటూ హెచ్చరించారు.

2027 సంక్రాంతిని టార్గెట్ చేసిన అనిల్ రావిపూడి..

కీర్తి సురేష్ హీరోయిన్.. షూటింగ్ ఎప్పుడు?

ఇలా పూజా హెగ్డే గురించి పూర్తిస్థాయిలో వ్యతిరేకత రావడంతో ఈ సినిమాలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇప్పటికే కీర్తి సురేష్ హీరోయిన్ ఎంపిక కాగా ఈ సినిమా మల్టీ స్టారర్ కావడంతో దర్శకుడు మరొక హీరోయిన్ వేటలో కూడా ఉన్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని శరవేగంగా షూటింగ్ పనులను పూర్తిచేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అనిల్ రావిపూడి ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా 2027 సంక్రాంతి సందర్భంగా మరో సక్సెస్ కొట్టడం కోసం అనిల్ రావిపూడి గట్టిగా ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటివరకు ఈయన డైరెక్షన్లో తొమ్మిది సినిమాలు విడుదల కాగా 9 సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తన పదవ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్, షైన్ స్క్రీన్ బ్యానర్స్ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది.

అనిల్ రావిపూడి కెరీర్‌లో ఇది 10వ సినిమా కావడంతో, ఆయన ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కామెడీ, యాక్షన్ కలగలిపిన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.