
📌 Key Points
- ‘యానిమల్ పార్క్’ స్క్రిప్ట్ వర్క్ 20% పూర్తి చేసిన సందీప్ వంగా, సినిమాలో చాలా ‘యానిమల్’ తరహా పాత్రలు ఉంటాయట!
- ప్రభాస్ ‘స్పిరిట్’ తర్వాత వెంటనే ‘యానిమల్ పార్క్’ సినిమాను మొదలు పెట్టనున్న సందీప్ రెడ్డి వంగా – 2027లో స్పిరిట్ విడుదల!
- తండ్రీ కొడుకుల ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన ‘యానిమల్’, బాక్సాఫీస్ దగ్గర రూ.900 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది.
- ‘యానిమల్’ సినిమాలో చూపించిన వైలెన్స్ కంటే చాలా ఎక్కువ వైలెన్స్ ‘యానిమల్ పార్క్’లో ఉండనుందని స్వయంగా చెప్పిన సందీప్!
యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు యానిమల్ పార్క్ తో మరోసారి రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వివరాలు చూద్దాం!
సందీప్ వంగా ప్లానింగ్ మామూలుగా లేదుగా!
Animal Park: యానిమల్.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో క్రియేట్ చేసిన సెన్సేషన్ ఈ సినిమా. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఫాథర్ అండ్ సన్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
మోస్ట్ వైలెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఆ సినిమాకు యానిమల్ పార్క్(Animal Park) అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలోనే తాజాగా యానిమల్ పార్క్ సినిమా గురించి ఆసక్తికర న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది. అదేంటంటే,, యానిమల్ పార్క్ సినిమాకు సంబందించిన 20 శాతం స్క్రిప్ట్ వర్క్ ను సందీప్ రెడ్డి వంగా ఆల్రెడీ కంప్లీట్ చేశేశాడట.
యానిమల్ పార్క్ లో అంతా వైలెన్స్ పార్క్!
అంతేకాదు, తన రైటింగ్ టీం పూర్తి కథను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట. యానిమల్ సినిమాలో కేవలం హీరో రణబీర్ కపూర్ మాత్రమే యానిమల్ తరహా బిహేవియర్ తో కనిపిస్తాడు. కానీ, యానిమల్ పార్క్ సినిమాలో ఆ తరహా పాత్రలు చాలానే ఉంటాయట. అందుకే, ఆ సినిమాకు యానిమల్ పార్క్ అని టైటిల్ పెట్టాడట సందీప్ రెడ్డి వంగ. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ చెప్పడం విశేషం.
స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ షురూ!
అందుకే, యానిమల్ సినిమాలో చూపించిన వైలెన్స్ కంటే చాలా రేట్లు ఎక్కువ వైలెన్స్ ఈ సినిమాలో ఉండనుందట. సందీప్ ఈ కామెంట్స్ చేసినప్పటినుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక సందీప్ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే యానిమల్ పార్క్ సినిమాను మొదలుపెడతాడట సందీప్. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ పార్క్ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా గురించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


