
సినీ ఇండస్ట్రీలో పెళ్లి పుకార్లు సర్వసాధారణం. తాజాగా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మరియు కావ్య మారన్‌ల పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. 2014 నుంచి వీరు ప్రేమలో ఉన్నారని చర్చలు.
Key Points
అనిరుధ్ రవిచందర్ మరియు కావ్య మారన్‌ల పెళ్లి వార్తలు వైరల్‌గా వ్యాపిస్తున్నాయి.
2014 నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు.
ఇరువురి తరఫు నుంచి ఎలాంటి స్పష్టీకరణ లేదు.
అనిరుధ్ ప్రముఖ సంగీత దర్శకుడు, కావ్య మారన్ సన్ గ్రూప్ అధినేత కూతురు.
అనిరుధ్-కావ్య ప్రేమ వార్తలు
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక పెళ్లి రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు నమ్మాలనిపించదు. మరికొన్నిసార్లు మాత్రం నిజంగా ప్రేమించుకుంటున్నారా? పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అలాంటి ఓ గాసిప్ పుల్‌గా వైరల్ అవుతోంది. అదే లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి?
తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనిరుధ్.. గతంలో ఆండ్రియా, కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లతో డేటింగ్ చేశాడనే వార్తలొచ్చాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. కానీ కాలక్రమేణా వాటి గురించి జనాలు మర్చిపోయారు. సడన్‍గా ఇప్పుడు సరికొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి యజమానిగా వ్యవహరిస్తున్న కావ్య మారన్‌ని అనిరుధ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని అంటున్నారు.
పెళ్లి పుకార్ల వైరల్
2014 నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, కానీ ఈ విషయం బయటపడకుండా సైలెన్స్ మెంటైన్ చేశారని.. త్వరలో మాత్రం పెళ్లి చేసుకుంటారనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ తమిళవాళ్లు కావడంతో ఇది నిజమేనేమోనని చాలామంది అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇరువైపుల నుంచి ఎలాంటి ఖండన లేదు. అలా అని అంగీకారం కూడా లేదు. కాబట్టి ఇప్పటివరకు అయితే ఇది రూమర్ మాత్రమే.
ఇరువురి నుండి స్పందన?
అనిరుధ్ విషయానికొస్తే టీనేజీలోనే సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కావ్య మారన్ విషయానికొస్తే.. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు. ఇప్పటికే తండ్రితోపాటు పలు వ్యాపారాల్లో కీలకంగా ఉంది. వీటితో పాటు ఐపీఎల్‌లోనూ హైదరాబాద్ జట్టుకి యజమానిగా వ్యవహరిస్తోంది.
ప్రస్తుతానికి ఇది ఒక పుకారే అయినప్పటికీ, అభిమానులు ఈ వార్తలను ఆసక్తిగా చూస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.


