
విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటించిన ‘కింగ్డమ్’ సినిమా నుంచి ‘అన్నా అంటేనే’ అనే సూపర్ ఎమోషనల్ సాంగ్ రిలీజ్ అయింది. అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
Key Points
విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటించిన 'కింగ్డమ్' సినిమా నుంచి 'అన్నా అంటేనే' పాట రిలీజ్
అన్నదమ్ముల అనుబంధాన్ని చాటుతూ సాగే ఎమోషనల్ మెలోడీ
జులై 31న 'కింగ్డమ్' సినిమా థియేటర్లలో విడుదల
అన్నా అంటేనే పాట లిరిక్స్
కింగ్డమ్.. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ రిలీజెస్ లో ఒకటి. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా జులై 31న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం (జులై 16) ఓ అదిరిపోయే మెలోడీ అన్నా అంటేనే అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులోని లిరిక్స్, మ్యూజిక్ మనసుకు హత్తుకునేలా సాగింది. మరి ఆ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం చూడండి.
విజయ్ దేవరకొండ , భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ నటిస్తున్న మూవీ కింగ్డమ్ (Kingdom). గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. తాజాగా రిలీజైన ఎమోషనల్ మెలోడీ సాంగ్ ను అనిరుధే పాడటం విశేషం. కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు. ఈ పాట ఇన్‌స్టాంట్ హిట్ అయింది. ఈ సాంగ్ ప్రోమోను ఒక రోజు ముందు రిలీజ్ చేయగా.. బుధవారం (జులై 16) పూర్తి సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మూవీలో అన్నదమ్ములుగా నటిస్తున్న విజయ్, సత్యదేవ్ మధ్య బంధాన్ని చాటుతూ ఈ పాట సాగిన తీరు చాలా బాగుంది. ఇద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ మూమెంట్స్ ను ఇందులో చూపించారు. మరి ఈ పాట లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. మీరూ మీ తోబుట్టువులతో కలిసి పాడుకోండి. జులై 31న ఈ కింగ్డమ్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
కొన్ని గుర్తులేవో మిగిలే..
అన్నా అంటేనే.. ఉన్నానంటూనే..
కింగ్డమ్ సినిమా విడుదల తేదీ
చిన్నోడి కోసం.. నిలబడతావే..
అన్నా అంటేనే.. ఉన్నానంటూనే..
చిన్నోడి కోసం.. కలబడతావే..
ఇన్నాళ్లుగా వేచిన వేకువ..
కలనా కలవరమా.. ఇది నిజమేనా..
అన్నదమ్ముల మధ్య అనుబంధం
అన్నా అంటేనే.. ఉన్నానంటూనే..
చిన్నోడి కోసం.. నిలబడతావే..
అన్నా అంటేనే.. ఉన్నానంటూనే..
చిన్నోడి కోసం.. కలబడతావే..
చివరగా, ‘అన్నా అంటేనే’ పాట కింగ్డమ్ సినిమాకు మరింత ఆకర్షణను తెచ్చింది. జులై 31న విడుదలయ్యే సినిమాను ఎదురుచూద్దాం.


