
📌 Key Points
- పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదల ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీతో మెగా అభిమానుల్లో ఆనందం!
- చిరంజీవి, నాగబాబులను ‘అన్నయ్య’ అని పిలుస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసిన అన్నా కొణిదల!
- 15 ఏళ్ల క్రితం మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన అన్నా.. బంధం గురించి వివరణ!
- సొంత అన్నయ్యలు లేకున్నా.. చిరంజీవి, నాగబాబులను సోదరులుగా భావిస్తున్నానని అన్నా కొణిదల వెల్లడి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో మెగా అభిమానుల్లో సందడి మొదలైంది. తొలి పోస్ట్ లోనే చిరంజీవి గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అన్నా కొణిదల ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Anna Konidala: పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల ఇన్‌స్టాగ్రామ్ లోకి రాగానే వరుసగా పోస్టులు చేస్తోంది. ఇందులో చిరంజీవిని అన్నయ్య అని ఎందుకు పిలుస్తానో చెబుతూ చేసిన ఎమోషనల్ పోస్ట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
Anna Konidala: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియా ఎంట్రీ ఇప్పుడు నెట్టింట పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన ఆమెకు.. పవన్ కళ్యాణ్ స్వయంగా ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికిన విషయం మనందరికీ తెలిసిందే. తన భర్తతో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఆమె తన మొదటి పోస్ట్ పెట్టింది.
అయితే ఇప్పుడు తన సెకండ్ పోస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి , మెగా బ్రదర్ నాగబాబులను ట్యాగ్ చేస్తూ ఆమె పెట్టిన ఒక ఎమోషనల్ మెసేజ్ అందరి హృదయాలను హత్తుకుంటోంది. మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని, ముఖ్యంగా ఆ ఇద్దరు అన్నయ్యలతో తనకున్న బాండింగ్‌ను ఆమె చాలా అందంగా అక్షరాల్లో పెట్టింది.
చిరంజీవిని అన్నయ్య అని పిలవడానికి కారణమిదే!
మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన కొత్తలో అలా..
“సరిగ్గా పదిహేనేళ్ల క్రితం నేను ఒక కొత్త కుటుంబంలోకి అడుగుపెట్టాను. అప్పటికే ఆ కుటుంబంలో ఉన్న వాళ్లంతా ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా, ఒక గట్టి బంధంతో కలిసిపోయి ఉన్నారు. అలాంటి పెద్ద కుటుంబంలో నేను ఎలా ఇమిడిపోవాలో, వాళ్లతో ఎలా కలిసిపోవాలో నాకు అస్సలు అర్థం కాలేదు. ఇంట్లో ఉన్నవాళ్లను ఏమని పిలవాలో కూడా నాకు తెలిసేది కాదు” అని ఆమె ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
భర్త మాటల్నే అరువు తెచ్చుకున్నా..
మెగా బ్రదర్స్‌తో అనుబంధం గురించి అన్నా
“మొదట్లో వాళ్లను అలా పిలవాలంటే నాకు కొంచెం భయంగా, సందేహంగా అనిపించేది. చాలా జాగ్రత్తగా, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని పిలిచేదాన్ని. కానీ రోజులు గడిచేకొద్దీ ఆ పిలుపు నా మనసులోంచి రావడం మొదలైంది. ఆ బంధం నా హృదయానికి హత్తుకుంది” అని అన్నా ఎమోషనల్ అయింది.
“నిజానికి వాళ్లను పిలవడానికి మన భాషలో ఇంకో సరైన పదం ఉందని నాకు చాలా కాలం తర్వాత తెలిసింది. కానీ ఆ విషయం తెలిసే సమయానికే.. మా మధ్య ఉన్న ఆ బాండింగ్ భాషకు అతీతంగా మారిపోయింది. నాకు సొంత అన్నయ్య అంటూ ఎవరూ లేరు. కానీ ఈ జీవితం చాలా సైలెంట్‌గా నాకు ఇద్దరు అద్భుతమైన అన్నయ్యలను బహుమతిగా ఇచ్చింది” అంటూ చిరంజీవి, నాగబాబులను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మెగా ఫ్యామిలీలో ఉన్న ఆ ప్రేమను, అన్నదమ్ముల మధ్య ఉన్న ఆ అనుబంధాన్ని పవన్ కళ్యాణ్ భార్య ఇంత అందంగా అర్థం చేసుకోవడం చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. వదినమ్మ పోస్ట్ సూపర్ అంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.
అన్నా కొణిదల చేసిన ఈ పోస్ట్ మెగా అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మెగా ఫ్యామిలీ బంధం గురించి ఆమె చెప్పిన మాటలు అందరి హృదయాలను హత్తుకుంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


