
📌 Key Points
- టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.
- బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థపు వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
- విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఫిబ్రవరి 26న జరగగా, మార్చి 4న రిసెప్షన్ జరిగింది.
- అల్లు శిరీష్ కూడా త్వరలో నైనిక రెడ్డిని వివాహం చేసుకోబోతున్నాడు, మార్చి 6న వివాహం జరగనుంది.
టాలీవుడ్ లో మరో హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ వారంలోనే నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి వార్తలు
Tollywood Actor: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లి భాజలు మోగుతూ ఉన్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా పూర్తి అయ్యాయి . రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమించుకుని ఫిబ్రవరి 26వ తేదీ పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో విరోష్ (Virosh) ఒకటైన విషయం తెలిసిందే. ఈ జంట 26న పెళ్లి చేసుకోగా మార్చి 4వ తేదీ ఎంతో ఘనంగా రిసెప్షన్ జరుపుకున్నారు. ఇలా వీరి వివాహపు వేడుకలు పూర్తికావడంతో మరొక హీరో అల్లు శిరీష్(Allu Shirish) పెళ్లి వేడుకలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే అల్లు శిరీష్ పెళ్లి కొడుకు ఫంక్షన్ సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.
అల్లు శిరీష్ నైనిక రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు వీరి వివాహం మార్చి ఆరో తేదీ ఎంతో ఘనంగా జరగబోతోంది. ఇప్పటికే అల్లు స్టూడియోస్ లో వీరిపై వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఇలా వీరి పెళ్లి వేడుక పూర్తి కాకుండానే మరొక టాలీవుడ్ హీరో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఒకరిగా ఉన్న వారిలో నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఈయన అల్లుడు శ్రీను అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు.
విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం
ఇలా పలు సినిమాలలో నటిస్తూ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ అనుకున్న స్థాయిలో ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఇకపోతే తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఈ వారంలోని వీరికి నిశ్చితార్థపు వేడుక కూడా జరగబోతుందని అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని సమాచారం. ఇలా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి కానీ ఈయన చేసుకోబోయే అమ్మాయి ఎవరు ఏంటి అనే వివరాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు.
కిష్కిందపురి సినిమాతో సక్సెస్..
అల్లు శిరీష్ వివాహం వివరాలు
బెల్లంకొండ శ్రీనివాస పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే అధికారక ప్రకటన రావాల్సిందే. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల భైరవం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకున్న ఈయన అనంతరం అనుపమ పరమేశ్వరన్ తో కలిసి కిష్కిందపురి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తదుపరి కొత్త సినిమాలను ఇప్పటివరకు ప్రకటించలేదు.
మొత్తానికి టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి నెలకొంది. బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి వార్తలపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


