|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నన్ను టార్గెట్ చేసి పరువు తీస్తున్నారు.. నిందితులు ఎవరో తెలిసి షాక్ అయ్యానంటూ అనుపమ సంచలన పోస్ట్

Published: 09-11-2025, 3:58 AM
నన్ను టార్గెట్ చేసి పరువు తీస్తున్నారు.. నిందితులు ఎవరో తెలిసి షాక్ అయ్యానంటూ అనుపమ సంచలన పోస్ట్

నటి అనుపమ పరమేశ్వరన్ మార్ఫింగ్ ఫోటోల వివాదంపై స్పందించారు. తనను టార్గెట్ చేసి పరువు తీస్తున్నారని, కేరళ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితురాలు ఓ యువతి అని తెలిసి షాక్ అయ్యానని సంచలన పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో యువత బాధ్యతగా ఉండాలని ఆమె హెచ్చరించారు.

Key Points

1

అనుపమ పరమేశ్వరన్ మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

2

కేరళ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనుపమ.

4

సోషల్ మీడియాలో బాధ్యతగా ఉండాలని యువతకు అనుపమ విజ్ఞప్తి.

అనుపమ మార్ఫింగ్ ఫోటోల కలకలం

కొంతమంది ఆకతాయిలు సెలబ్రిటీలతు టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్టార్ హీరోల కానుంచి హీరోయిన్ల వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇటీవల చిరంజీవి కూడా మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పడ్డారు. తాజాగా, ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌(Anupama Parameswaran)కు సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఇందులో షాకింగ్ ట్విస్ట్ ఒకటి ఉంది. ఇన్నాళ్లు ఇలా చేస్తుంది.. అబ్బాయిలే అని అంతా అనుకున్నారు. కానీ అనుపమ ఫొటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేసింది మాత్రం ఓ 20 ఏళ్ల అమ్మాయి అని తెలిసి అంతా భయపడిపోతున్నారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ అనుపమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ నోట్ షేర్ చేసింది. ‘‘కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నా పోస్టులు పెడుతున్నారు. ముందు పట్టించుకోలేదు. అయితే నా ఫొటోలను మార్ఫింగ్ చేసి ఏకంగా నా కుటుంబ సభ్యులతో నా స్నేహితులకు, సెలబ్రిటీలకు కూడా షేర్ చేశారని తెలుసుకుని చాలా బాధపడ్డాను. ఆపై ఎలాంటి ఆధారాలు లేకుండానే నా గురించి తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నారు. వాటిని చూసి ఎవరో కావాలనే టార్గెట్ చేసి చేస్తున్నారని తెలుసుకున్నాను. ఒకే వ్యక్తి చాలా అకౌంట్లతో ఈ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు తెలిసింది. నేను ఏదైనా పోస్ట్ పెట్టినా తప్పుడు కామెంట్లు చేస్తున్నారు. అందుకే నేను కేరళ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను.

నిందితురాలు ఎవరో తెలిసి షాక్!

వాళ్ళు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెపట్టారు. అందులో నిజాలు బయటకు వచ్చాయి. ఇదంతా చేసింది తమిళనాడులో ఓ 20 ఏళ్ల యువతి అని తెలిసి షాక్ అయ్యాను. తన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆమె వివరాలను ప్రపంచానికి చెప్పదలుచుకోలేదు. చట్టం తన పని తాను చూసుకుంటుందని వదిలేస్తున్నాను. యువత మేలుకోవాలనే ఈ విషయాన్ని చెబుతున్నా. చేతిలో ఫోన్, ఉందని సోషల్ మీడియా అకౌంట్ ఉందని ఒకరి పరువు తీసే హక్కు మీకు లేదు. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలి. చట్టం అందరికీ సమానమే’’అని రాసుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలిసి యువతులు భయపడిపోతున్నారు.

యువతకు అనుపమ హెచ్చరిక

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

అనుపమ మార్ఫింగ్ ఫోటోల వెనుక ఉన్న నిజాలు తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన యువత సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్ని ఇస్తోంది. చట్టం తన పని చేసుకుపోతుందని అనుపమ స్పష్టం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.