|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనుష్క శెట్టి `ఘాటి` మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చింది.. స్వీటి విశ్వరూపం చూసేది అప్పుడే

Published: 02-06-2025, 10:21 AM

అనుష్క శెట్టి నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఘాటి’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. జులై 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి మరియు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలు పోషించారు.

Key Points

1

అనుష్క శెట్టి 'ఘాటి' చిత్రం జులై 11న విడుదల

2

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం

4

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల

‘ఘాటి’ చిత్రం విడుదల తేదీ ప్రకటన

అనుష్క శెట్టి ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. ఆమె చివరగా `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంలో నటించింది. ఈ మూవీ వచ్చి రెండేళ్లు అవుతుంది. తాజాగా ఇప్పుడు `ఘాటి` అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

అయితే ఇందులో గతంలో ఎప్పుడూ చూడని అనుష్కని మనం చూడబోతున్నాం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో ప్రత్యర్థులను ఊచకోత కోస్తూ కనిపించింది. వెన్నులో వణుకు పుట్టించింది. ఇంటెన్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది అనుష్క.

దీంతో `ఘాటి` సినిమాపై ఈ గ్లింప్స్ అంచనాలను పెంచింది. గ్లింప్స్ లోనే ఇలా ఉంటే ఇక మూవీలో ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ పెరిగింది.

అనుష్క శెట్టి కొత్త అవతారం

ఈ క్రమంలో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. తాజాగా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. జులై 11న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది.

క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్  పతాకంపై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది టీమ్‌. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అనుష్క, విక్రమ్ ప్రభు నది గుండా సంచులు మోసుకుంటూ వెళుతున్న విజువల్స్ ఇంటెన్స్ జర్నీని సూచిస్తున్నాయి.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం

‘ఘాటి’ .. అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్‌ సక్సెస్ ఫుల్ మూవీ ‘వేదం’ తర్వాత కలిసిన చేస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్. అనుష్క, UV క్రియేషన్స్‌తో నాలుగోసారి కలిసి వర్క్ చేయడం మరో విశేషం.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి ఎడిటర్. సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. `ఘాటి` సినిమా జులై 11న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.

సుదీర్ఘ వేచి చూపు తర్వాత, ‘ఘాటి’ చిత్రం జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుష్క శెట్టి కొత్త లుక్ మరియు కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.