
📌 Key Points
- ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 25, 2026 నుండి జూన్ 4, 2026 వరకు జరుగుతాయి.
- ఆలస్య రుసుము లేకుండా మే 1, 2026 నుండి మే 9, 2026 వరకు ఫీజు చెల్లించవచ్చు.
- రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు మే 1, 2026 నుండి మే 7, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రీవెరిఫికేషన్‌లో జవాబు పత్రం ఫోటోకాపీ లభిస్తుంది.
ఏపీ పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక! ఇటీవల విడుదలైన ఫలితాల అనంతరం, సప్లిమెంటరీ పరీక్షలు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు గడువులను ఈ కథనంలో చూడవచ్చు.
సప్లిమెంటరీ పరీక్షల ముఖ్య తేదీలు
ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2026 (AP SSC Supplementary Exams)కు సంబంధించి షెడ్యూల్‌ను కూడా అధికారులు విడుదల చేశారు. ఏపీ పదో తరగతి పరీక్షలు 25-05-2026 నుంచి 04-06-2026 వరకు జరుగుతాయి.
విద్యార్థులు ఆలస్య రుసుము నుంచి తప్పించుకోవడానికి సరైన సమయంలో ఫీజు చెల్లించాలి. ఆలస్య రుసుము లేకుండా.. 01-05-2026 నుంచి 09-05-2026 చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుముతో 10-05-2026 నుంచి 24-05-2026 వరకు చెల్లించవచ్చు. సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్‌ను కలవాలి.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియ
ఇక రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను కూడా అధికారులు ప్రకటించారు. ఇందుకోసం 01-05-2026 ఉదయం 10 గంటల నుంచి 07-05-2026 రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకునేందుకు ఆలస్యం లేకుండా అభ్యర్థులు సంబంధిత స్కూల్ హెడ్ మాస్టర్‌ను కలవాల్సి ఉంటుంది.
నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. తమకు వచ్చిన మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. రీకౌంటింగ్‌లో కేవలం మార్కులను మళ్లీ లెక్కిస్తారు. ఎక్కడైనా మార్కులు వేయడం మర్చిపోయారా అని చూస్తారు. రీ-వెరిఫికేషన్‌లో మార్కులను మళ్లీ సరిచూస్తారు, జవాబు పత్రం ఫోటోకాపీని మీకు పంపిస్తారు.
దరఖాస్తు విధానం, గడువు
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకొని, తమ భవిష్యత్తుకు సంబంధించిన ఈ కీలక పరీక్షలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. సకాలంలో దరఖాస్తు చేసుకోవడం ముఖ్యం.


