
📌 Key Points
- ఏపీలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు గడువు.
- టెన్త్ మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం సీట్ల కేటాయింపు.
- మే 1న జిల్లాల వారీగా దరఖాస్తుల ప్రకటన, మే 5న డీఈవోల ద్వారా మెరిట్ లిస్టు విడుదల.
- మే 6న ధ్రువపత్రాల పరిశీలన అనంతరం సీట్ల ఖరారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 30 దరఖాస్తులకు చివరి తేదీ. టెన్త్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మరిన్ని వివరాలు తెలుసుకోండి.
మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కల్పిస్తారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా… ఈ గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగియనుంది.
దరఖాస్తు చేసుకునే విద్యార్థి…. సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలల్లో టెన్త్ చదువుతున్న వాళ్లై ఉండాలి. పూర్తిగా టెన్త్ ఎగ్జామ్ లో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మెరిట్ ను ప్రామాణికంగా తీసుకొని ఎంపీసీ,బైపీసీ, సీఈసీతో పాటు ఇతర కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.
దరఖాస్తు గడువు మరియు ముఖ్యమైన తేదీలు
మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పూర్తిగా మెరిట్ ఆధారంగానే సీటు కేటాయిస్తారు. మే 1వ తేదీన జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్యను ప్రకటిస్తారు. ఆపై మే 3వ తేదీ నాటికి మెరిట్ లిస్టులను సిద్ధం చేస్తారు. మే 5వ తేదీన డీఈవోలు వీటిని విడుదల చేస్తారు. మే 6వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆపై సీటును ఖరారు చేస్తారు. క్లాసులు ప్రారంభ తేదీలను త్వరలో ప్రకటిస్తారు.
మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఏపీ మోడల్ స్కూళ్లలో ఇంటర్ చదవాలనుకునే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. టెన్త్ లో సాధించిన మార్కులే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.


