
📌 Key Points
- ఏపీ పాలిసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు పూర్తి.
- మొత్తం 78,763 సీట్లలో కేవలం 42,925 సీట్లు మాత్రమే భర్తీ.
- సీట్లు పొందిన విద్యార్థులు జూలై 11 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
- తరగతులు జూలై 8 నుంచి ప్రారంభమయ్యాయి.
ఏపీ పాలిసెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. మొత్తం 78,763 సీట్లలో 42,925 మాత్రమే భర్తీ కాగా, విద్యార్థులు జూలై 11 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలు
AP Polycet Counseling 2026 : ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలిసెట్ (AP POLYCET 2026) మొదటి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. ప్రవేశాలు పొందిన విద్యార్థులు తమ అలాట్‌మెంట్ ఆర్డర్లను అధికారిక వెబ్‌సైట్ https://polycet.ap.gov.in/ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది మొదటి విడత కౌన్సెలింగ్‌లో కేవలం 54.49 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద మొత్తం 78,763 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కేవలం 42,925 సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు సాంకేతిక విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ మరియు గడువు
పాలిసెట్ పరీక్షలో మొత్తం 1,48,951 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ప్రవేశాలకు అర్హత సాధించారు. అయితే…. వీరిలో కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం కేవలం 45,743 మంది మాత్రమే ఫీజు చెల్లించారు. ఫీజు చెల్లించిన వారిలో 44,440 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాగా, 43,835 మంది విద్యార్థులు కళాశాలలు, బ్రాంచిల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు.
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 11వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ప్రక్రియతో పాటు, తమకు కేటాయించిన కాలేజీలకు నేరుగా వెళ్లి కూడా రిపోర్ట్ చేయడం తప్పనిసరి. మరోవైపు, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన క్లాస్ వర్క్ (తరగతులు) జూలై 8వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి.
తరగతుల ప్రారంభం మరియు తదుపరి దశలు
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఏపీ పాలిసెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. విద్యార్థులు జూలై 11 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం తప్పనిసరి. మిగిలిన సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ త్వరలో జరగనుంది.


