
📌 Key Points
- రేషన్ కార్డు అప్లికేషన్ సర్వీస్ ఛార్జీలు పెంపు.
- కొత్త రైస్ కార్డు, డూప్లికేట్ కార్డు, సభ్యుల చేర్పు/తొలగింపు ఛార్జీలు అధికం.
- ఈ-కేవైసీ చేయని వారి రేషన్ కార్డులు రద్దు కావచ్చు.
- రేషన్ షాపులు, సచివాలయాల్లో ఈ-కేవైసీ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రేషన్ కార్డు అప్లికేషన్ సర్వీస్ ఛార్జీలను పెంచింది. అలాగే, ఈ-కేవైసీ చేయని వారి కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉంది.
రేషన్ కార్డు సర్వీసు ఛార్జీల పెంపు
రేషన్ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసింది. రేషన్ కార్డుల నిరంతర ప్రక్రియ అని ప్రకటించగా… కొత్తగా కార్డులు కావాల్సిన వారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇక పేర్ల మార్పుతో పాటు అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఇక రేషన్ కార్డ్ అప్లికేషన్లకు సంబంధించి సర్వీస్ ఛార్జ్ లను పెంచారు. దీంతో కొత్త రైస్ కార్డ్, డూప్లికేట్ రైస్ కార్డ్, రైస్ కార్డులో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు రైస్ కార్డ్ విభజన వంటి అన్ని సేవల కోసం ఎక్కువగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ-కేవైసీ తప్పనిసరి – గడువు సమీపిస్తోంది!
ఇక రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు… ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ చేయించుకోలేదు. ఈ ప్రాసెస్ వారి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. వేలిముద్ర ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించే ప్రక్రియనే ఈకైవీసీ అంటారు. దీంతో నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చు.
ఈకేవైసీ పకడ్బందీగా నిర్వహించటం ద్వారా… నకిలీ లబ్ధిదారులను ఏరివేస్తారు. సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఈకేవైసీ సమాచారాన్ని సేకరిస్తోంది.
నకిలీ కార్డుల నివారణకు ప్రభుత్వం చర్యలు
రేషన్ డీలర్ షాప్ లో ఈకేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.గ్రామ / వార్డు సచివాలయాల్లో కూడా ఈ ప్రాసెస్ చేస్తారు.E-PoS(ఈ పోస్) యంత్రంలో వేలిముద్ర పెట్టగానే E-KYC పూర్తవుతుంది. మరోవైపు కార్డు ఇప్పటివరకు తీసుకొనివారు.. ఆయా రేషన్ షాపుల వద్దకు తీసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
కావున, రేషన్ కార్డుదారులు పెరిగిన ఛార్జీలను గమనించి, ఈ-కేవైసీని వెంటనే పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి. ప్రభుత్వం నకిలీ కార్డులను తొలగించడానికి చర్యలు తీసుకుంటోంది.


