|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎ.ఆర్. రెహమాన్ కచేరీ: బాధితుడికి రూ. 55వేలు పరిహారం

Published: 10-06-2025, 2:52 AM
ఎ.ఆర్. రెహమాన్ కచేరీ: బాధితుడికి రూ. 55వేలు పరిహారం

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కచేరీ రద్దు కారణంగా ఒక అభిమాని కోర్టును ఆశ్రయించాడు. రూ.10,000 టికెట్ ఖర్చుతో, మానసిక వేదనకు పరిహారం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.

Key Points

1

A.R. రెహమాన్ కచేరీ టికెట్ కొన్న అభిమానికి వర్షం కారణంగా కచేరీ రద్దు.

2

రూ. 10,000 టికెట్ ఖర్చుతో, మానసిక వేదనకు పరిహారం కోరారు.

4

మొత్తం రూ. 55,000 పరిహారం రెండు నెలల్లో చెల్లించాలని ఆదేశం.

కచేరీ రద్దు, అభిమాని బాధ

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఏర్పాటు చేసిన సంగీత కచేరీ కోసం రూ. 10వేలు చెల్లించి ఒక అభిమాని టికెట్‌ కొన్నాడు. అయితే భారీ వర్షం కారణంగా ఆ షో రద్దు కావడంతో అతను కలత చెందాడు. దీంతో తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆ బాధితుడు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశాడు. అయితే, రెండేళ్ల విచారణ తర్వాత బాధితుడికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది

కోర్టులో పిటిషన్, విచారణ

2023 ఆగస్టు 12న చెన్నైలో మ్యూజికల్ కన్సర్ట్‌కు హాజరు కానున్నానని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్వీట్‌ చేశారు. దానిని చూసిన అభిమానులు భారీగా టికెట్లు కొన్నారు. అయితే, ఆ రోజు భారీ వర్షం పడటంతో షో రద్దు అయింది. తరువాత, ఈ కార్యక్రమం సెప్టెంబర్ 10న జరిగింది. ఆగస్టులో కొనుగోలు చేసిన టిక్కెట్లతో అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చని ఈవెంట్ నిర్వాహకులు ప్రకటించారు. అయితే, చెన్నైలోని అన్నా నగర్‌కు చెందిన అర్జున్, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రూ. 10 వేల  టికెట్ కొనుగోలు చేశాడు. సెప్టెంబర్‌లో ఈ కార్యక్రమం జరిగినప్పుడు నిర్వాహకులు సరైన ముందస్తు సమాచారం ఇవ్వకుండా జరిపించడంతో   తాను  తీవ్ర మనస్తాపానికి గురైనట్లు అర్జున్‌ పేర్కొన్నారు. దీంతో చెన్నై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.

రూ. 55,000 పరిహారం

అందులో, అతను ఇలా పేర్కొన్నాడు, “సంగీత దర్శకులు A.R. రెహమాన్‌  మ్యూజికల్‌ కార్యక్రమం కోసం రూ.10 వేల  టికెట్ కొన్నప్పటికీ,  కచేరీని చూడలేకపోయిను. అందుకు నేను చాలా బాధపడ్డాను. కాబట్టి నేను అనుభవించిన మానసిక వేదనకు పరిహారంగా రూ. 10 లక్షలు చెల్లించాలి. టికెట్ రుసుమును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. అర్జున్‌ చేసిన ఫిర్యాదును విచారించిన చెన్నై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. త ఎ.ఆర్. రెహమాన్ సంగీత కచేరీని నిర్వహించిన ACTCని పరిహారంగా రూ. 50,000 చెల్లించాలని ఆదేశించింది. పిటిషనర్ అర్జున్‌కు రెండు నెలల్లోగా మొత్తం రూ.55,000 చెల్లించాలని, అందులో రూ.5,000 వ్యాజ్య ఖర్చులుగా చెల్లించాలని ఆదేశించింది.

అభిమాని చేసిన ఫిర్యాదును విచారించిన కోర్టు, A.R. రెహమాన్ కచేరీ నిర్వాహకులకు రూ.55,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుతో కచేరీ రద్దుతో బాధితులకు న్యాయం జరిగింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.