
📌 Key Points
- శోభన్ బాబు సలహాలను పట్టించుకోని అర్జున్.. భారీగా ఆస్తి నష్టం!
- ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా ‘సీతాపయనం’ ఫిబ్రవరి 13న విడుదల కానుంది.
- శోభన్ బాబు రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో చెన్నైలో వందల కోట్ల ఆస్తి సంపాదించారు.
- అర్జున్, శోభన్ బాబు కలిసి ఒకే సినిమాలో నటించినా మంచి అనుబంధం ఉంది.
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ఒక సంచలన విషయం బయటకి వచ్చింది. శోభన్ బాబు చెప్పిన మాట వినకపోవడం వల్ల ఆయన చాలా ఆస్తి నష్టపోయారట. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా!
శోభన్ బాబు ఇచ్చిన విలువైన సలహాలు ఏంటి?
Sobhan Babu : ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన యాక్షన్ కింగ్ అర్జున్ ఇప్పుడు దర్శకుడిగా మారి తన కూతురు ఐశ్వర్యని హీరోయిన్ గా పెట్టి సినిమా తీసుకున్నాడు. అర్జున్ దర్శకత్వంలో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సీతాపయనం సినిమా ఫిబ్రవరి 13 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అర్జున్ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.(Sobhan Babu)
అర్జున్ ఎందుకు శోభన్ బాబు మాట వినలేదు?
ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి మాట్లాడారు అర్జున్ సర్జా. ఒకప్పటి స్టార్ హీరో శోభన్ బాబు అప్పట్లో చాలా మందికి పెట్టుబడుల విషయంలో సలహాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అనేకమంది సీనియర్ సెలబ్రిటీలు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. శోభన్ బాబు ఎక్కువగా భూమి మీద, రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెట్టి చెన్నైలో వందల కోట్ల ఆస్తిని సంపాదించారు. అర్జున్ కి కూడా కొన్ని అలాగే సలహాలిచ్చారట.
ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా సీతాపయనం విడుదల!
అర్జున్ శోభన్ బాబు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..శోభన్ బాబు గారితో కలిసి నేను చేసింది ఒకటే సినిమా. అయినా ఆయన నాతో చాలా క్లోజ్ గా ఉంటారు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆయన నా పక్కన కూర్చొని చాలా సార్లు పెట్టుబడులు పెట్టమని సలహాలు ఇచ్చారు. అప్పట్లో నేను ఆయన మాటలు వినిపించుకోలేదు. ఆయన కూడా నాకు చాలాసార్లు పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని చెప్పి చూసారు కానీ నాకు తెలిసి తెలియని వయసులో ఆయన మాటలు పట్టించుకోలేదు. అప్పుడు శోభన్ బాబు గారు చెప్పిన వాటిల్లో పెట్టుబడి పెట్టి ఉంటే నాకు ఇవాళ ప్రాపర్టీ చాలా ఉండేది అని తెలిపారు.
శోభన్ బాబు సలహాలను మిస్ చేసుకున్న అర్జున్ గారి పరిస్థితి ఇది. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. మీ అభిమాన హీరోల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి.


