
📌 Key Points
- అషురెడ్డి కేసులో హైకోర్టు సంచలన తీర్పు.. మీడియాకు కీలక ఆదేశాలు జారీ.
- పరువునష్టం కలిగించే కథనాల ప్రసారంపై హైకోర్టు నిషేధం విధించింది.
- ఇప్పటికే ఉన్న వివాదాస్పద కంటెంట్ తొలగించాలని కోర్టు ఆదేశం ఇచ్చింది.
- ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అషురెడ్డి హెచ్చరించింది.
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన అషురెడ్డి కేసులో ఊహించని మలుపు! హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్. మీడియా, నెటిజన్లకు హైకోర్టు ఎలాంటి వార్నింగ్ ఇచ్చింది? అషురెడ్డికి నిజంగా ఊరట లభించిందా? పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే!
హైకోర్టు సంచలన మధ్యంతర ఉత్తర్వులు!
టాలీవుడ్ నటి, యాంకర్ అషురెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అషు హైదరాబాద్ కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిందన్న ఆరోపణలతో సీసీఎస్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై అషురెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు విషయంలో మీడియాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అషురెడ్డి గురించి అవమానకర, అవాస్తవ కథనాలను ప్రసారం చేయకూడదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా సంస్థలు, కంటంట్ క్రియేటర్లు సోషల్ మీడియాలో అషురెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి పరువునష్టం కలిగించే అంశాలను ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే అప్ లోడ్ చేసిన వివాదాస్పద కంటెంట్ కూడా తొలగించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఉల్లంగిచే వారిపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.
కోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీని అషు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కోర్టు ఆదేశాలను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపింది. తన ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాను, నెటిజన్లను కోరింది. ప్రస్తుతం విషయం కోర్టు పరిధిలో ఉందని, ఇప్పటికే తనపై ఎన్నో ఆరోపణలు చేశారని పేర్కొంది. ఆ అభ్యంతకర పోస్టులను తొలగించాలని, కొత్తవి ప్రచురించకుండా సహకరించాలని ఆశిస్తున్నట్టు తెలిపింది. తనకు సపోర్ట్ చేస్తున్నవారికి థాంక్స్ చెబుతూ నిబంధనలు పాటించనివాళ్లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇక ఆరోపణలు వచ్చిన తరవాత అషురెడ్డి వాటిపై స్పందించకుండా మొదటి నుండి మీడియాకు వార్నింగ్ ఇవ్వడం ఆశ్చర్యకరం.
మీడియా, నెటిజన్లకు హైకోర్టు వార్నింగ్!
అషురెడ్డికి ఊరట.. అసలు కేసు ఏంటి?
అషురెడ్డి కేసులో హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీశాయి. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మరిన్ని సంచలన అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను చూస్తూ ఉండండి!


