|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అశ్విన్ బాబు: ధర్మరక్షణ కోసం వచ్చినవాడు గౌతమ్.. హైప్ పెంచేస్తున్న టీజర్

Published: 15-05-2025, 12:50 PM
అశ్విన్ బాబు: ధర్మరక్షణ కోసం వచ్చినవాడు గౌతమ్.. హైప్ పెంచేస్తున్న టీజర్

యంగ్ హీరో అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్ ఇటీవల విడుదలైంది. మెడికో థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. మనోజ్ మంచు వాయిస్ ఓవర్ ఈ టీజర్‌కు మరింత బలం చేకూర్చింది.

Key Points

1

అశ్విన్ బాబు 'వచ్చినవాడు గౌతమ్' టీజర్ విడుదల

2

మెడికో థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం

4

యాక్షన్, ఎమోషనల్ సీన్స్ తో సినిమా హైప్ పెంచుతోంది

‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్ విశేషాలు

డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సయిటింగ్ మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’ రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం.ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. టి. గణపతి రెడ్డి లావిష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పవర్ ఫుల్ ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్, హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేశారు. ‘ధర్మం దారి తప్పినప్పుడు… ఏ అవతారం రానప్పుడు… వచ్చినవాడు గౌతమ్’ అంటూ హీరో మనోజ్ మంచు పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్ ఓ యాక్ష్ మూడ్‌ను సెట్ చేస్తుంది. మొదటి ఫ్రేమ్ నుంచే టీజర్ కట్టిపడేస్తుంది. గౌతమ్ పాత్రలో అశ్విన్ బాబు కనిపించిన తీరు పవర్‌ఫుల్, ఇంటెన్స్, మిస్టీరియస్‌గా ఉంది.

ఆయన బాడీ లాంగ్వేజ్‌, యాక్షన్ టైమింగ్ అన్నీ ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురిచేస్తున్నాయి. టీజర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు కొత్తదనాన్ని పంచుతుండగా, ఎమోషనల్ ఇంటెన్సిటీ కథలో ఉన్న డెప్త్‌ను తెలియజేస్తుంది. హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. ‘టీజర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ కృష్ణ కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. మీరు ఊహించలేని పాయింట్‌తో ఈ సినిమా రాబోతుంది. మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుందని భావిస్తున్నాను. మంచు మనోజ్ అన్నకి థాంక్యూ సో మచ్. ఆయన వాయిస్ టీజర్‌కి ప్రాణం పోసి మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఈ టీజర్ హిట్ డైరెక్టర్ శైలేష్ కోలను చేతుల మీద లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా టీజర్‌ని సక్సెస్ చేసినందుకు అందరికీ థాంక్యూ’ అని తెలిపారు.

అశ్విన్ బాబు పాత్ర ప్రత్యేకత

సినిమా హైప్ పెంచుతున్న అంశాలు

మొత్తంమీద, ‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అశ్విన్ బాబు నటన, కథాంశం ప్రేక్షకులను అలరించేలా ఉంటాయని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.