|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ashwini Sree: ‘అలా చేయకపోతే అస్సలు జీవితమే కాదు’.. అశ్విని గొప్ప మనసు!

Published: 29-04-2025, 10:47 AM

బిగ్ బాస్ షో ద్వారా పేరు తెచ్చుకున్న అశ్విని శ్రీ, తన పుట్టినరోజును అనాథాశ్రమంలో జరుపుకుంది. ఆమె అక్కడి పిల్లలకు నాన్ వెజ్ వంటకాలు వడ్డించి, తన మంచి మనసును చాటుకుంది.

Key Points

1

అశ్విని శ్రీ తన పుట్టినరోజును అనాథాశ్రమంలో జరుపుకుంది.

2

అనాథ పిల్లలకు నాన్ వెజ్ వంటకాలు వడ్డించింది.

4

అభిమానులు అశ్విని శ్రీ మంచి మనసును ప్రశంసిస్తున్నారు.

అశ్విని శ్రీ పుట్టినరోజు వేడుకలు

తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలా క్రేజ్ తెచ్చుకుని సినిమాల్లోనూ ఛాన్స్‌లు కొట్టేశారు. అలాంటి వారిలో ‍అశ్విని శ్రీ కూడా ఒకరు. బిగ్‌బాస్ 7వ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది.

అయితే ఇటీవల తన బర్త్‌ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది అశ్విని శ్రీ. ఈ సందర్భంగా తనలో అందమే కాదు.. మంచి మనసు కూడా ఉందని నిరూపించుకుంది ముద్దుగుమ్మ. తన పుట్టిన రోజు వేడుకను ఓ అనాథాశ్రమంలో జరుపుకుంది. అక్కడే ఉన్న పిల్లలకు నాన్ వెజ్ వంటకాలు తానే స్వయంగా వడ్డించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇతరుల కోసం జీవించకపోతే.. అసలు అది జీవితమే కాదు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు అశ్విని శ్రీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు భవిష్యత్తులో ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని బిగ్‌బాస్ బ్యూటీకి ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నారు.

అనాథాశ్రమంలో సేవా కార్యక్రమం

అభిమానుల ప్రశంసలు

అశ్విని శ్రీ చేసిన ఈ కార్యక్రమం చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. తన పుట్టినరోజును ఇతరులకు సేవ చేస్తూ జరుపుకోవడం అద్భుతం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.