|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆగస్ట్ రెండో వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్‌లు ఇవే.. ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్, ఆహా, సన్‌ నెక్ట్స్ లో అవి రచ్చ

Published: 11-08-2025, 1:51 AM
ఆగస్ట్ రెండో వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్‌లు ఇవే.. ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్, ఆహా, సన్‌ నెక్ట్స్ లో అవి రచ్చ

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులకు ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందిస్తున్నాయి. ఈ వారం ఓటీటీలో ఏ సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల అవుతున్నాయో ఇక్కడ చూద్దాం.

Key Points

1

ఆగస్ట్ రెండో వారంలో ఓటీటీలో విడుదలవుతున్న 'J.S.K – జానకి V/s స్టేట్ ఆఫ్ కేరళ' సినిమా.

2

జీ5లో 'తెహ్రాన్' హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్.

4

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌ల గురించి సమాచారం.

ఆగస్ట్ రెండో వారం ఓటీటీ విడుదలలు

ప్రస్తుతం ఓటీటీ బాగా విస్తరించింది. సినిమాల కోసం ఆడియెన్స్ థియేటర్లకు వెళ్లడానికంటే ఓటీటీలోనే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వందలు వందలు పెట్టి థియేటర్లలో సినిమాలు చూసేందుకు భయపడుతున్నారు. ఒక్క టికెట్‌ ఛార్జ్ తో ఇంటిళ్లిపాది ఇంట్లోనే సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటికితోడు మంచి కంటెంట్‌ ఉన్న వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఈక్రమంలో ఓటీటీలో వచ్చే సినిమాలకు, సిరీస్‌లకు డిమాండ్‌ పెరుగుతుంది. ఆడియెన్స్ వాటి కోసం వెయిట్‌ చేస్తున్నారు. మరి ఆగస్ట్ రెండో వారంలో(ఆగస్ట్ 11 నుంచి 17)   ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏంటో తెలుసుకుందాం.

అనుపమా పరమేశ్వరన్‌ మలయాళంలో నటించిన మలయాళ మూవీ `J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ` మూవీ ఈ వారం స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఇది గత నెలలో థియేటర్లకి వచ్చింది. అక్కడ టైటిల్‌ విషయంలో వివాదం నెలకొంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళకి  జానకి పేరు పెట్టడాన్ని కేరళాలోని కొన్ని హిందుత్వ సంఘాలు వ్యతిరేకించాయి. ఈ విషయంలో పెద్ద రచ్చ జరిగింది. టైటిల్‌లో చిన్న మార్పుతో విడుదల చేశారు. అక్కడ డీసెంట్‌గా ఆడింది. ఇప్పుడిది ఓటీటీలోకి రాబోతుంది. జీ 5లో ఆగస్ట్ 15 నుంచి తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో అనుపమా పరమేశ్వరన్‌తోపాటు సురేష్‌ గోపీ కీలక పాత్ర పోషించారు. లైంగిక వేధింపులు ఫేస్‌ చేసిన జానకిగా అనుపమా నటించింది. దీనికి ప్రవీణ్‌ నారాయణన్‌ దర్శకత్వం వహించగా, కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. ఓటీటీలోకి రాబోతున్న ఈ మూవీపై అందరి చూపు ఉంది.

దీంతోపాటు జీ 5లో హిందీ మూవీ `తెహ్రాన్‌` స్ట్రీమింగ్‌ కాబోతుంది. జాన్‌ అబ్రహం, మనుషీ చిల్లర్‌ జంటగా నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆగస్ట్ 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి అరుణ్‌ గోపాలన్‌ దర్శకత్వం వహించారు. మడ్డాక్‌ ఫిల్మ్స్ నిర్మించింది. సినిమాలో వివాదాస్పద కంటెంట్‌ ఉన్న నేపథ్యంలో దీన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారు.

‘J.S.K – జానకి V/s స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా విశేషాలు

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన `కానిస్టేబుల్‌ కనకం` వెబ్‌ సిరీస్‌ ఓటీటీలోకి రాబోతుంది. దీనికి ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు. కాప్‌ డ్రామాగా ఇది రూపొందింది. థ్రిల్లర్‌ అంశాల మేళవింపుగా దీన్ని తెరకెక్కించారు. కానిస్టేబుల్‌ అయిన కనకం ఓ అమ్మాయి మిస్టరీ కేస్‌ని ఛేదించే క్రమంలో ఫేస్‌ చేసిన సంఘటనల సమాహారంగా దీన్ని రూపొందించారు. ఈ మూవీ ఈటీవీ విన్‌లో ఆగస్ట్ 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ అవసరాల ముఖ్య పాత్రలు పోషించారు.

`మ్యాడ్‌` సిరీస్‌తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు కుర్ర హీరో సంగీత్‌ శోభన్‌. ఇందులో తనదైన స్టయిల్లో కామెడీ చేసి మెప్పించారు. ఆయన సోలో హీరోగా నటించిన మూవీ `గ్యాంబ్లర్స్`. ఈ చిత్రం జూన్‌ 6న థియేటర్లలో విడుదలైంది. కానీ ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఆగస్ట్ 14న దీన్ని ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నారు. సన్‌ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఇందులో సంగీత్‌ శోభన్‌తోపాటు ప్రశాంతి హీరోయిన్‌గా నటించగా, కేఎస్కే చైతన్య దర్శకత్వం వహించారు. ఇది ఐదుగురు వ్యక్తుల చుట్టూ తిరిగే కథ.

`అందేరా` అనే హిందీ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 14 నుంచి ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో ప్రజాక్త కోలి, సుర్వీన్‌ చావ్లా, ప్రియా బపత్‌, కరణ్‌వీర్‌ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించారు. రాఘవ్‌ డార్‌ దర్శకత్వం వహించారు. రితేష్‌ సిద్వానీ, ఫర్హాన్‌ అక్తర్‌, కాస్సిమ్‌ జగ్మాజియా, విశాల్‌ రామ్‌ చందాని, మోహిత్‌ షా, కరణ్‌ అన్షుమాన్‌ కలిసి నిర్మించారు. హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్ వివరాలు

హాలీవుడ్‌ సిరీస్‌ `బట్టర్‌ ప్లై` సీజన్‌ వన్‌ కూడా ఓటీటీలోకి వస్తుంది. ప్రైమ్‌ వీడియోస్‌లో ఇది ఆగస్ట్ 13 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. అలాగే `సాసేజ్‌ పార్టీః ఫూడ్‌టోపియా` సీజన్‌ 2 యానిమేషన్‌ సిరీస్‌ ఆగస్ట్ 13నే స్ట్రీమింగ్‌ అవుతుంది. దీనికితోడు `అబాండోన్డ్ః ది ఉమె్‌ ఇన్‌ ది డికేయింగ్‌ హౌజ్‌` అనే హాలీవుడ్‌ సిరీస్‌ కూడా ఆగస్ట్ 15న స్ట్రీమింగ్‌ అవుతుంది.

ఈ రోజు నుంచి రెండు సిరీస్‌లు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. వాటిలో ఫైసల్‌ షేక్‌, షెఫాలీ బగ్గా కలిసి నటించిన `లవెంచర్‌` సిరీస్‌ నేడు(ఆగస్ట్ 11)న జీయో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా ఇది రూపొందింది. మరో సిరీస్‌ `మన్‌పసంద్‌ కి షాది` కూడా నేటి నుంచే జీయో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

హిందీలో రూపొందిన క్రేజీ మూవీ `సారే జహాన్‌ ఏ అచ్చా` ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ నెల 13న ఇది నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా సాగే ఈ మూవీలో ప్రతీక్‌ గాంధీ, సన్నీ హిందుజా, సుహైల్‌ నయ్యర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గౌరవ్ శుక్లా రూపొందించారు.

చివరగా, ఆగస్ట్ రెండవ వారం ఓటీటీలో వినోదానికి కొదవలేదు. వివిధ భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.