|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అవతార్ 3 డిజాస్టర్: బ్రేకీవెన్ కష్టమే.. తొలి మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే!

Published: 22-12-2025, 8:44 PM
అవతార్ 3 డిజాస్టర్: బ్రేకీవెన్ కష్టమే.. తొలి మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే!
  • అవతార్ 3 ఇండియాలో మొదటి మూడు రోజుల్లో కేవలం ₹75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
  • అవతార్ 2 మొదటి మూడు రోజుల్లో ₹175 కోట్లకు పైగా వసూలు చేసింది, అవతార్ 3 గణనీయంగా తగ్గింది.
  • ప్రపంచవ్యాప్తంగా అవతార్ 3 కలెక్షన్స్ $345 మిలియన్లు మాత్రమే, గత భాగాలతో పోలిస్తే దారుణంగా ఉన్నాయి.
  • సినిమా బ్రేకీవెన్ సాధించాలంటే $2.5 బిలియన్లు అవసరం, ఇది ప్రస్తుత ట్రెండ్‌తో అసాధ్యమని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

జేమ్స్ కామెరాన్ ‘అవతార్ 3’ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. మొదటి మూడు రోజుల్లోనే ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా దారుణమైన కలెక్షన్లు సాధించి, ఫ్రాంచైజ్‌కి తొలి డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా బ్రేకీవెన్ చేరుకోవడం ప్రశ్నార్థకమే.

అవతార్ 3: ఇండియాలో తొలి మూడు రోజుల కలెక్షన్స్

Avatar 3: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ నుంచి వచ్చిన లేటెస్ట్ భారీ చిత్రం అవతార్: ఫైర్ అండ్ యాష్(Avatar 3). అవతార్ సిరీస్ లో మూడవ భాగంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మాత్రం అనుకున్నంత రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. ఇండియాలో ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో కేవలం రూ.75 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయడం విశేషం. అదే అవతార్ 2 సినిమాకి మొదటి మూడు రోజుల్లో రూ.175 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దీన్ని బట్టి భట్టి చూస్తే అర్థం అవుతుంది అవతార్ 3 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది.

Riddhi Kumar: ఆరెంజ్ కలర్ డ్రెస్సులో ఓ రేంజ్ అందాలు.. రద్దీ కుమార్ గ్లామర్ పిక్స్.. ఫోటోలు

ప్రపంచవ్యాప్తంగా దారుణమైన వసూళ్లు: డిజాస్టర్ టాక్

కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అవతార్ 3 కలెక్షన్స్ దారుణంగానే ఉన్నాయి. అవతార్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన మొదటి రెండు పార్ట్స్ ఏకంగా 3 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించాయి. కానీ, అవతార్ 3 మాత్రం కానీసం 1.5 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం కూడా కష్టమే అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక డొమెస్టిక్ మార్కెట్ అయినా నార్త్ అమెరికాలో అయితే మరీ దారుణమైన కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ఇప్పటివరకు అవతార్ 3 అక్కడ కేవలం 88 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అవతార్ 2 తో పోల్చితే 34 శాతం వరకు కలెక్షన్స్ తగ్గాయి అని చెప్తున్నారు. ఒక రకంగా ఇది డిజాస్టర్ రిజల్ట్ అనే చెప్పాలి.

బ్రేకీవెన్ సాధ్యమేనా? భారీ ప్రశ్నార్థకం

ఓవరాల్ గా చూసుకుంటే అవతార్ 3 సినిమాకు 345 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. గత రెండు పార్టీలతో పోల్చితే ఈ కలెక్షన్స్ చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఈ ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా కనీసం 2 బిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టడం కూడా కష్టమే అంటున్నారు. కానీ, అవతార్ 3 సినిమా బ్రేకీవెన్ సాదించాలి అంటే కనీసం 2.5 బిలియన్ డాలర్ల కలెక్షన్స్ అయినా సాధించాల్సి ఉంటుంది. లేదంటే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ కింద పడటం ఖాయం. మరి చూడాలి రానున్న రోజుల్లో ఈ సినిమా ఏదైనా మ్యాజిక్ చేస్తుందా అని.

మొత్తం మీద, అవతార్ 3 కలెక్షన్లు ఫ్రాంచైజ్ చరిత్రలోనే అత్యంత నిరాశపరిచాయి. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ సినిమా బ్రేకీవెన్ దాటడం అత్యంత కష్టమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏమైనా మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.