📌 Key Points
- అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- జేమ్స్ కామెరూన్ థియేటర్ టెక్నీషియన్లకు లేఖ రాసి కీలక సూచనలు చేశారు.
- సినిమా లైట్ లెవెల్, ఆడియో కాన్ఫిగరేషన్, ఫ్రేమింగ్ సరిగ్గా ఉండాలని సూచించారు.
- అధిక సౌండ్ వల్ల స్పీకర్లు, స్క్రీన్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) విడుదలకు ముందే థియేటర్ యజమానులకు, టెక్నీషియన్లకు ముఖ్యమైన సూచనలు చేశారు. సినిమా సౌండ్ సిస్టమ్, స్క్రీన్‌లకు నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన రాసిన లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది.
జేమ్స్ కామెరూన్ లేఖలోని కీలక అంశాలు
James cameron: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James cameron: ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. జేమ్స్ కామెరున్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో అవతార్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకోగా త్వరలోనే మూడవ భాగం కూడా విడుదలకు సిద్ధమైంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.. ఇక ఈ మూడో భాగంలో ఫండోరా ప్రపంచానికి సరికొత్త విలన్ వరాంగ్ ను పరిచయం చేయబోతున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో థియేటర్ టెక్నీషియన్లకు దర్శకుడు జేమ్స్ కామెరూన్ థియేటర్ టెక్నీషియన్లకు కొన్ని ప్రత్యేకమైన సూచనలను తెలియజేస్తూ ఒక లెటర్ రాశారు ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అవతార్ ఫైర్ అండ్ యాష్ ను ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నాతోపాటు నా టీం కూడా చాలా ఆత్రుతగా ఉన్నామని తెలిపారు. ఇక ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో లైట్ లెవెల్ ఆడియో కాన్ఫిగరేషన్ సరైన ప్రేమింగ్ గురించి కొన్ని సలహాలు ఇస్తూ ఈయన లేఖ రాశారు ఈ సినిమా సౌండ్ సిస్టంకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఈయన థియేటర్ టెక్నీషియన్లకు సలహాలు ఇచ్చారు. ఇటీవల కాలంలో అధిక సౌండ్ కారణంగా స్పీకర్లు పగిలిపోవడం థియేటర్లలో స్క్రీన్స్ చినిగిపోవడం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని జేమ్స్ కామెరున్ ముందుగానే ఇలాంటి సలహా ఇచ్చారని తెలుస్తోంది.
అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ ప్రత్యేకతలు
James Cameron instructions. pic.twitter.com/KbZrbo1cCI
— Avatar 3: Fire and Ash (@avatar3news) December 15, 2025
థియేటర్ల సాంకేతిక సమస్యలపై హెచ్చరిక
అవతార్ ఫ్రాంచైజీ హాలీవుడ్ మూవీ అయినప్పటికీ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమా విడుదలకు ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయని తెలుస్తుంది. ఈ సినిమా ఏకంగా 3 గంటల 15 నిమిషాల నిడివితో రన్ టైం లాక్ చేయబడిందని తెలుస్తోంది. ఇక అవతార్ ఫ్రాంచైజీలో రెండవ భాగం 29వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 16 సంవత్సరాల తర్వాత మూడో భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.
జేమ్స్ కామెరూన్ ముందుచూపుతో కూడిన ఈ సలహాలు అవతార్ 3 చిత్రాన్ని ప్రేక్షకులు అత్యుత్తమ నాణ్యతతో చూడటానికి సహాయపడతాయి. థియేటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా నివారించడానికి ఇది ఒక ముఖ్యమైన చర్య.



Zareen Khan’s Epic Reply to Photographer’s Indecent Demand Goes Viral