|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆయుధ పూజ చేస్తే వ్యాపారాల్లో నష్టాలు రావు.. దీని ప్రాముఖ్యత, భారత సైన్యం ఎందుకు నిర్వహిస్తుందో తెలుసుకోండి!

Published: 29-09-2025, 9:57 AM

దసరా పండుగ తొమ్మిది రోజుల్లో భాగంగా మహానవమి నాడు ఆయుధ పూజను జరుపుకుంటారు. పనిముట్లు, వాహనాలను పూజించడం ద్వారా వ్యాపారాల్లో నష్టాలు రావు, ప్రమాదాలు జరగవు అని నమ్ముతారు. దీని ప్రాముఖ్యత, చరిత్రతో పాటు భారత సైన్యం ఎందుకు ఈ పూజను నిర్వహిస్తుందో తెలుసుకుందాం.

Key Points

1

దసరా పండుగలో భాగంగా మహానవమి నాడు ఆయుధ పూజను నిర్వహిస్తారు.

2

పనిముట్లు, వాహనాలను పూజించడం వల్ల వ్యాపారాల్లో నష్టాలు రావు, ప్రమాదాలు జరగవు అని నమ్మకం.

4

భారత సైన్యం ప్రతి ఏటా ఆయుధాలకు శక్తి కలగాలని, విజయాలు సాధించాలని ఈ పూజను చేస్తుంది.

ఆయుధ పూజ ప్రాముఖ్యత మరియు దాని చరిత్ర

దసరా పండుగను తొమ్మిది రోజులు పాటు జరుపుతారు. మొదట మూడు రోజులు దుర్గాదేవిని ఆరాధిస్తారు, ఆ తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని పూజిస్తారు. మనం జీవితంలో కోరుకున్న గమ్యాన్ని చేరుకోవాలంటే సరస్వతీ దేవిని పూజిస్తే మంచిది. సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానం, విద్యా పెరుగుతాయి. ప్రతి ఒక్కరికి చదువు చాలా ముఖ్యమైనది, అదేవిధంగా వృత్తి కూడా చాలా ముఖ్యం.

అయితే పనులు చేసే ప్రతి ఒక్కరూ కూడా వారి పనిముట్లను భగవంతుడు ముందు పూజించే సాంప్రదాయం ఒకటి ఉంది. దానినే ఆయుధ పూజ అని అంటారు. ఆయుధ పూజ నాడు వాహనాలను, ఆయుధాలను శుభ్రంగా కడిగి పూజ చేస్తారు. అమ్మవారి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తారు.

దసరా పర్వదినాన ఆయుధ పూజలు జరుపుతూ ఉంటారు. రావణుడిని వధించే ముందు రాముడు కూడా ఆయుధాలను పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. పాండవులు కూడా విజయం కలగాలని ఆయుధాలకు పూజ చేశారని శాస్త్రాల్లో చెప్పబడింది. మహిషాసురుని చంపడానికి ముందు దుర్గాదేవి కూడా ఆయుధాలను పూజించింది.

ఆయుధ పూజ చేయడం వల్ల కలిగే లాభాలు

ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని మహానవమి అని అంటారు. ఈ మహానవమి కూడా విశిష్టమైన రోజు . అయితే ఈ కార్మికులు, వాహనదారులు, కులవృత్తులవారు, అలాగే ఇతర రంగాల్లో వారు కూడా ఆయుధాలను పూజిస్తారు. ఇలా పూజిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా ఉండొచ్చు అని నమ్మకం. అదేవిధంగా చేపట్టే ప్రతి కార్యంలో విజయం కలుగుతుందని నమ్ముతారు.

భారత సైన్యం ఎందుకు ఆయుధ పూజ నిర్వహిస్తుంది?

విజయదశమి నాడు భారత సైన్యం కూడా ఆయుధ పూజ చేస్తుంది. ఆయుధాలను పూజిస్తే ఆయుధాలకు ప్రత్యేక శక్తి వస్తుందని నమ్ముతారు. యుద్ధంలో అది సహాయపడుతుందని వారి నమ్మకం. భారత సైన్యం ఇలా ఈ సంప్రదాయాన్ని పాటించడం వలన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతుంది.

భారత సైన్యం ఆయుధ పూజ ఎందుకు చేస్తుంది?

అదే విధంగా సైనికులకు మరింత ధైర్యం వస్తుంది. భారత సైన్యం ప్రతి ఏటా దసరా నాడు ఆయుధాలను పూజిస్తుంది. దుర్గాదేవి యోగినీయులైన జయ, విజయలను ఆరాధిస్తారు. ఆ తర్వాత గంగాజలంతో ఆయుధాలను శుద్ధి చేసి, పసుపు, కుంకుమలను సమర్పిస్తారు, పువ్వులతో పూజిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఆయుధ పూజ అనేది మన కృషికి, పనిముట్లకు కృతజ్ఞత తెలియజేసే పవిత్ర సంప్రదాయం. ఈ పూజ ద్వారా విజయాలు, రక్షణ లభిస్తాయని నమ్ముతారు. ఈ ఆచారాన్ని పాటించడం ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.