|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

B3 మూవీ: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో నానిరాజ్.. ఫిల్మ్ ఛాంబర్‌లో గ్రాండ్ లాంచ్!

Published: 27-02-2026, 10:36 AM
B3 మూవీ: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో నానిరాజ్.. ఫిల్మ్ ఛాంబర్‌లో గ్రాండ్ లాంచ్!
  • యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ‘B3’ మూవీ, కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరణ!
  • దర్శకుడు నానిరాజ్ స్వీయ సంగీతం, మార్చి నుండి జూన్ వరకు షూటింగ్ షెడ్యూల్స్!
  • నటీనటులు: అన్వేష్, సిరి, శ్రీదేవి, సుమన్, జీవా, అజయ్ ఘోష్, ఎల్బీ శ్రీరామ్ ఇంకా చాలా మంది!
  • ఫిల్మ్ ఛాంబర్‌లో లోగో ఆవిష్కరణ, ముఖ్య అతిథులుగా తుమ్మలప్రసన్న కుమార్, ప్రతాని రామకృష్ణ గౌడ్!

నానిరాజ్ దర్శకత్వంలో వస్తున్న B3 మూవీతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ రాబోతోంది! ఈ సినిమా లోగో ఆవిష్కరణ ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగింది. సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఫిల్మ్ ఛాంబర్‌లో B3 మూవీ లోగో ఆవిష్కరణ!

B3 Movie; దర్శకుడు నానిరాజ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ B3. VVS క్రియేషన్ బ్యానర్‌లో శ్రీరంగం సతీష్‌ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా లోగో ఆవిష్కరణ నేడు(ఫిబ్రవరి 27) ఫిల్మ్ ఛాంబర్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి కార్యదర్శి తుమ్మలప్రసన్న కుమార్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు & తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్!

ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. నానిరాజ్ గత 9 సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్ గా పని చేశాడు. ఆలాగే, షార్ట్ ఫిల్మ్స్ కూడా డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ B3(B3 Movie) సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో మంచి కామెడీ అండ్ యూత్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక్కడ మరోవిశేషం ఏంటంటే, ఈ సినిమాను ఆయనే మ్యూజిక్ కూడా అందిస్తున్నాడు.

నానిరాజ్ స్వీయ దర్శకత్వం, సంగీతం!

ఇక ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ మార్చి నుంచి జూన్ వరకు జరుగనున్నాయి. అలాగే ఈ సినిమాలో, అన్వేష్, సిరి, శ్రీదేవి, సుమన్, జీవా, అజయ్ఘోష్, ,LB శ్రీరామ్, చిత్రమ్ శ్రీను, చత్రపతి శేఖర్, జబర్దాష్ అప్పారావు, షేకింగ్ శేషు, రవి కుమార్, శ్రీకాంత్, హరీష్, రాజు, G నారాయణ రావు, సైనిక, హర్ష వర్దిని, మమత, స్నేహ, జగదీశ్వరి, ధనలక్ష్మి రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించనున్నారు. ఇంకా ఈ సినిమాకు సురేష్ ఆత్రేయ డిఓపిగా, శ్రీను ఎడిటర్ గా పని చేస్తున్నారు.

B3 మూవీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రాబోతోంది. సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.