|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్యూరియాసిటీ పెంచుతున్న ‘బకాసుర రెస్టారెంట్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Published: 02-05-2025, 4:46 AM
క్యూరియాసిటీ పెంచుతున్న ‘బకాసుర రెస్టారెంట్’ ఫస్ట్ లుక్ పోస్టర్

కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించే చిత్రాల తాకిడి కొనసాగుతోంది. అదే తరహాలో వైవా హర్ష, ప్రవీణ్ నటించిన ‘బకాసుర రెస్టారెంట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌.

‘బకాసుర రెస్టారెంట్’ ఫస్ట్ లుక్ విడుదల

గత కొద్ది రోజుల నుంచి చిన్న సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద ఊహించని విధంగా హిట్ అవుతున్నాయి. దీంతో కొత్త నటీనటులు సైతం తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు వెరైటీ కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలాంటి కథతోనే ఓ కమెడియన్ రాబోతున్నాడు. కమెడియన్స్ ప్రవీణ్(Praveen), వైవా హర్ష(Viva Harsha) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’ (BakasuraRestaurant ). అయితే ఈ సినిమాతో ఎస్‌జే సూర్య(SJ Surya) దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. దీనిని ఎస్‌జే మూవీస్ బ్యానర్‌పై లక్ష్మణచారి, జనార్థన్ చారి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వికాసం బడిసా సంగీతం అందిస్తున్నారు.

ఇందులో కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజిఎఫ్ గరుడ రామ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. తాజాగా, ‘బకాసుర రెస్టారెంట్’ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో వైవా హర్ష భయంకరమైన లుక్‌లో కనిపించగా.. కొంతమంది బిర్యాని బగోనను ప్లేట్‌లోకి వంచుతూ కనిపించారు. అలాగే ఓ వ్యక్తి బిర్యాని వండుతూ కోపంగా పండ్లు కొరుకుతున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది.

వైవా హర్ష, ప్రవీణ్ కీలక పాత్రలు

హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమా

‘బకాసుర రెస్టారెంట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు పెరిగాయి. సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.