|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bakasura Restaurant : ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్న సినిమా.. ఈ తిండిపోతు దయ్యం సినిమా మీరు చూశారా?

Published: 14-09-2025, 6:44 AM
Bakasura Restaurant : ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్న సినిమా.. ఈ తిండిపోతు దయ్యం సినిమా మీరు చూశారా?

ప్రవీణ్ నటించిన బకాసుర రెస్టారెంట్ సినిమా ఓటీటీలో విడుదలై ట్రెండింగ్‌లో ఉంది. తిండిపోతు దయ్యం కథాంశంతో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Key Points

1

బకాసుర రెస్టారెంట్ ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది.

2

ప్రవీణ్ నటించిన ఈ హారర్ కామెడీ సినిమా అమెజాన్ ప్రైమ్ మరియు సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

4

తిండిపోతు దయ్యం కథాంశంతో ఆకట్టుకుంటోంది.

ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న బకాసుర రెస్టారెంట్

Bakasura Restaurant : కమెడియన్ ప్రవీణ్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ‘బకాసుర రెస్టారెంట్‌’. ఎస్‌జే మూవీస్‌ బ్యానర్ పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మాణంలో ఎస్‌జే శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 8న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో వైవా హర్ష, కృష్ణభగవాన్, షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.(Bakasura Restaurant)

బకాసుర రెస్టారెంట్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. నిన్నటిదాకా ఆరో స్థానంలో ఉండగా ఇప్పుడు టాప్ 4 లో బకాసుర రెస్టారెంట్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. అలాగే ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం ఓటీటీలో రిలీజయిన మూడు రోజుల్లోనే ఈ సినిమా ఈ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

ప్రవీణ్ నటనకు ప్రేక్షకాదరణ

హారర్ కామెడీ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటోంది

కొంతమంది బ్యాచిలర్స్ కి అనుకోకుండా తాంత్రిక విద్యల పుస్తకం దొరకడంతో అందులో ఉన్న ఓ మంత్రాన్ని జపించడంతో ఓ తిండిపోతు ఆత్మ బయటకు వచ్చి వీళ్లను ఎలాంటి ముప్పు తిప్పలు పెట్టింది అనే కథాంశంతో హారర్ కామెడీగా ఈ సినిమాని తెరకెక్కించారు.

మొత్తంమీద, బకాసుర రెస్టారెంట్ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది. హారర్ కామెడీ ప్రేమికులు తప్పకుండా చూడదగిన సినిమా ఇది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.