|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖండ 2 ఎఫెక్ట్: బాలయ్య బాబు నెక్స్ట్ ప్లాన్స్ రివీల్!

Published: 29-03-2026, 7:05 AM
అఖండ 2 ఎఫెక్ట్: బాలయ్య బాబు నెక్స్ట్ ప్లాన్స్ రివీల్!
  • ‘అఖండ 2’ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో బాలయ్య రూటు మార్చినట్లు సమాచారం.
  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 111వ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.
  • వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమాకు ‘కురుక్షేత్ర’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
  • నయనతార బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది.

నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ‘అఖండ 2’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఆయన తన భవిష్యత్ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. పలువురు దర్శకులు ఆయన కోసం కథలు సిద్ధం చేస్తున్నారు.

అఖండ 2 ప్రభావం: బాలయ్య నిర్ణయం మార్పు

Nandamuri Balakrishna: బాలయ్య లైనప్ చూస్తుంటే మామూలు కన్ఫ్యూజన్ లో లేదు . అవును అసలు బాలయ్య ఎవరికీ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు అంటూ ఫిలిం సర్కిల్స్ లో ఒకటే డిస్కషన్. ఈ సారి ఎలాగైనా నార్త్ బెల్ట్ లో కూడా పాగా వేస్తుందంటూ భారీ అంచనాలు పెట్టేసుకున్న ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ అనుకున్నంత ఆడకపోవడంతో (సుమారు రూ.112 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోవడంతో)బాలయ్య ఇప్పుడు తన రూటును పూర్తిగా మార్చేశాడని వినిపిస్తున్న టాక్. ఈ క్రమంలోనే ఆయనకి ఏకంగా నలుగురు డైరెక్టర్స్ కథలు చెప్పడంతోఎవరిని ముందు లైన్లోకి తీసుకురావాలనే డైలమాలో పడ్డాడట బాలయ్య.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన 111వ సినిమాను (NBK 111) ఇప్పటికే పట్టాలెక్కించిన సంగతి తెల్సిందే. గతంలో బాలయ్యకు ‘వీరసింహారెడ్డి’ వంటి భారీ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనిపై బాలయ్యకు అపారమైన నమ్మకం ఉంది కూడా. నిజానికి ఈ కాంబోలో ఒక భారీ హిస్టారికల్ మూవీ రావలసి ఉండగా ‘అఖండ 2’ తర్వాత భారీ బడ్జెట్ మరియు ప్రయోగాలతో కూడిన సినిమాల కంటే, పక్కా కమర్షియల్ యాక్షన్ సినిమాలే బెటర్ అని బాలయ్య భావించాడట.అందుకే ఆ హిస్టారికల్ సబ్జెక్టును పక్కన పెట్టి, ఒక పవర్ ఫుల్ సోషల్ మెసేజ్ ఉన్న యాక్షన్ డ్రామాను ఎంచుకున్నాడట.ఇక ఇందులో బాలయ్యకు లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార మెయిన్ లీడ్ కాగా గ్లామరస్ బ్యూటీ డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్‌గా ఆన్ బోర్డ్ అని వినిపిస్తుంది.కానీ మేకర్సే  ఎక్కడా క్లారీటీ ఇవ్వని పరిస్థితి.ఇకపోతే ఈ సినిమాని ఈ ఏడాది దసరా లేదా దీపావళి నాటికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.ఒకవేళ ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ తో డిలే అయితే  2027 సంక్రాంతి బరిలో బాలయ్య నిలవడం పక్కా.

గోపీచంద్ మలినేనితో బాలయ్య 111వ సినిమా

ఇక బాలయ్య హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో వివేక్ ఆత్రేయతో సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.  వివేక్ బాలయ్య కోసం ఆయన ఒక వెరైటీ ‘మాస్ ప్లస్ క్లాస్’ మిక్స్డ్ సబ్జెక్టును సిద్ధం చేశాడని,ఈ సినిమాకు ‘కురుక్షేత్ర’ అనే టైటిల్ ఫిక్స్ అయ్యే చాన్స్ ఉందని,ఇక ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తారని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.అయితే వివేక్ ఆత్రేయ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘సరిపోదా శనివారం’ తర్వాత ఆయన క్రేజ్ పెరిగింది కూడా. కానీ బాలయ్య లాంటి మాస్ హీరోను ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ఫ్యాన్స్ లో రైజ్ అవుతున్న డౌట్స్.అయితే  ‘వీరసింహారెడ్డి’తీసిన బ్యానర్ కావడంతోబాలయ్య ఈ ప్రాజెక్టుపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.ఇక త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్ వచ్చే ఛాన్స్ ఉందట కూడా.

ఇక ఇదే క్యూలో  ఊహించని విధంగా మరో కుర్ర డైరెక్టర్ చేరడం గమనార్హం. యస్ ..అల్లరి నరేష్‌తో ‘నాంది’ లాంటి సీరియస్ హిట్ తీసిన విజయ్ కనకమేడల కథలో ఉన్న డీటైలింగ్ బాలయ్యకు బాగా నచ్చిందట. ఇక ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ పరంగా చాలా కంట్రోల్‌లో ఉంటూనే, తక్కువ టైమ్‌లో షూటింగ్ పూర్తి చేసుకునేలా ప్లాన్ చేశారట. సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తానంటున్న ఈ సినిమా స్పీడ్ గా పూర్తయ్యే అవకాశం ఉంది కూడా. అయితే మలినేని సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో, టైమ్ తీసుకుని తన  డిసీషన్ చెబుతానని బాలయ్య అన్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

ఇక ఈ కన్ఫ్యూజన్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హరీష్ శంకర్. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ బోల్తా కొట్టడంతో బాలయ్య ఈ ప్రాజెక్ట్ విషయంలో డ్రాప్ అయినట్టు తెలుస్తుంది. అవుట్ డేటెడ్ కంటెంట్‌తో రిస్క్ చేయడం బాలయ్యకు ఇష్టం లేదని, అందుకే వివేక్ ఆత్రేయ లాంటి యంగ్ డైరెక్టర్ల వైపు మొగ్గు చూపుతున్నారని ఇండస్ట్రీ టాక్.అయితే  దీనికన్నా ముందు హరీష్ శంకర్ హీరో రామ్‌ను కలిసినట్టు వార్తలు వచ్చాయి. కానీ కథ విషయంలో ఇద్దరికీ సింక్ అవ్వకపోవడంతో ఆ ప్రపోజల్ పక్కకు వెళ్ళిపోయిందట అయితే హరీష్ శంకర్ ప్రస్తుతం బాలయ్య కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. కానీ ఇప్పటికే లైనప్‌లో ముగ్గురు దర్శకులు ఉండటం, బాలయ్య నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రాకపోవడం చూస్తుంటే హరీష్‌కు అసలు ఛాన్స్ ఇప్పట్లో వస్తుందా అంటే అనుమానమే !

వివేక్ ఆత్రేయతో ‘కురుక్షేత్ర’ మూవీ?

ఇక వీరితో పాటు మార్కో డైరెక్టర్ హనీఫ్ ఆదేని, దండుపాల్యం డైరెక్టర్ శ్రీనివాస రాజు లాంటి వాళ్ళు కూడా బాలయ్య లైనప్ లో ఉన్నారని టాక్. మొత్తానికి ‘అఖండ 2’ తర్వాత బాలయ్య రూట్ మార్చి తన కెరీర్‌ను చాలా ప్లాన్డ్ గా ముందుకు తీసుకెళ్తున్నట్టె కనిపిస్తుంది.మరి  ప్రస్తుతం చేతిలో ఉన్న ఈ నాలుగు ప్రాజెక్టులలో ఏది ముందు పట్టాలెక్కుతుంది? దసరాకు బాలయ్య గర్జన ఉంటుందా లేదా సంక్రాంతికే పరిమితమవుతారా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.ఏది ఏమైనా, నందమూరి అభిమానులకు రాబోయే రోజుల్లో పూనకాలు రావడం మాత్రం పక్కా !

మొత్తానికి బాలయ్య తన తదుపరి సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏ దర్శకుడితో ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి. అభిమానుల్లో మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.