|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన బాలకృష్ణ! ఆ అరుదైన రికార్డు ఏంటో తెలుసా?

Published: 29-12-2025, 12:28 AM
  • నటసింహా బాలకృష్ణ యూఎస్ మార్కెట్‌లో అరుదైన రికార్డు సాధించారు.
  • వరుసగా ఐదు సినిమాలు (అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకుమహారాజ్, అఖండ 2) 1 మిలియన్ డాలర్ మార్కును దాటాయి.
  • ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో కలిపి మొత్తం ఆరు మిలియన్ డాలర్ చిత్రాలు బాలయ్య ఖాతాలో ఉన్నాయి.
  • ప్రస్తుతం NBK 111, ఆదిత్య 999 వంటి పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బాలయ్య బిజీగా ఉన్నారు.

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ యూఎస్ మార్కెట్‌లో చరిత్ర సృష్టించారు. వరుసగా ఐదు మిలియన్ డాలర్ల చిత్రాలతో ఏకైక హీరోగా రికార్డు నెలకొల్పారు. ‘అఖండ 2 తాండవం’ సినిమాతో ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. బాలయ్య సాధించిన ఈ అద్భుత ఘనత సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బాలకృష్ణ యూఎస్ మార్కెట్ సంచలనం

BalaKrishna:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. ఆరు పదుల వయసు దాటినా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా యాక్షన్ పర్ఫామెన్స్ తో థియేటర్లలోనే సంచలనం సృష్టిస్తున్న బాలయ్య తన అద్భుతమైన నటనతో రికార్డులు కొల్లగొడుతున్నారు. అంతేకాదు తాజాగా యూఎస్ మార్కెట్లో అరుదైన రికార్డును సృష్టించి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి బాలయ్య సాధించిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..

గాడ్ ఆఫ్ మోసెస్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న బాలకృష్ణ ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. బాలయ్యకు జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. హర్షాలీ మల్హోత్ర కీలకపాత్ర పోషించారు. 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్ కూడా దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాతో బాలయ్య అమెరికాలో అరుదైన ట్రాక్ రికార్డును నమోదు చేసుకున్నారు. అంతేకాదు నార్త్ అమెరికాలో బాలయ్య నటించిన ఐదు సినిమాలు వరుసగా వన్ మిలియన్ డాలర్ మార్కును అందుకోవడం విశేషం.

మిలియన్ డాలర్ల క్లబ్‌లో బాలయ్య చిత్రాలు

అలా బాలకృష్ణ నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి , డాకుమహారాజ్ , అఖండ 2 ఇలా వరుసగా ఐదు సినిమాలు ఒక మిలియన్ డాలర్ మార్కును క్రాస్ చేసి బాలయ్యకు అరుదైన ట్రాక్ రికార్డును అందించాయి. అంతేకాదు గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా మిలియన్ డాలర్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. దీన్ని బట్టి చూస్తే బాలయ్య ఖాతాలో ఏకంగా ఆరు సినిమాలు వచ్చి చేరాయి. అలా ఈ రికార్డు సాధించిన ఏకైక హీరోగా బాలయ్య సంచలనం సృష్టించారు. ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

బాలయ్య అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే.. గతంలో వీరసింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య అదే డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదల తేదీ టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. హిస్టారికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. అలాగే ఆదిత్య 999 సినిమాలో కూడా బాలయ్య నటిస్తున్నారు. 1991లో క్లాసిక్ మూవీగా నిలిచిన ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ గా తీస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు క్రిష్ జాగర్లమూడితో ఈ సినిమాను చేయడమే కాకుండా ఈ సినిమా ద్వారా తన కొడుకు మోక్షజ్ఞని కూడా లాంచ్ చేయాలని బాలయ్య భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే రజనీకాంత్ నటించిన జైలర్ 2 సినిమాలో కూడా బాలయ్య కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

బాలయ్య భవిష్యత్ ప్రాజెక్టులు

యూఎస్ మార్కెట్‌లో బాలకృష్ణ సాధించిన ఈ రికార్డు ఆయన సినీ కెరీర్‌లో ఒక మైలురాయి. వరుస బ్లాక్‌బస్టర్‌లతో దూసుకుపోతున్న బాలయ్య రాబోయే చిత్రాలతో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.