|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దేవాన్ష్ వేడుకలో బాలయ్యకు ఏమైంది? కంగారు పడుతున్న అభిమానులు! అసలేం జరిగింది?

Published: 15-03-2026, 6:35 AM
దేవాన్ష్ వేడుకలో బాలయ్యకు ఏమైంది? కంగారు పడుతున్న అభిమానులు! అసలేం జరిగింది?
  • బాలకృష్ణ మనవడు నారా దేవాన్ష్ ధోతి వేడుకలో బాలయ్య కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
  • దేవాన్ష్ ధోతి వేడుక ఫోటోలలో బాలకృష్ణ కాళ్ళు తెల్లగా ఉండటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
  • బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
  • బాలకృష్ణ త్వరలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమా చేయనున్నారు.

నందమూరి బాలకృష్ణ మనవడు నారా దేవాన్ష్ ధోతి వేడుకలో పాల్గొన్నారు. అయితే, బాలకృష్ణకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ కావడంతో ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన కాళ్ళకు ఏమైందని ప్రశ్నలు వేస్తున్నారు.

దేవాన్ష్ ధోతి వేడుకలో బాలయ్య సందడి

Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాలకృష్ణ చివరిగా అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో నందమూరి అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ తన తదుపరి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈయన తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాలయ్య అభిమానులు తన ఆరోగ్యం గురించి ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ఆరోగ్యంగానే ఉన్నారా? ఆయన ఏదైనా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలకృష్ణ మనవడు నారా దేవాన్ష్ దోతి వేడుకను ఎంతో ఘనంగా జరిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు అయిన నారా దేవాన్ష్ ధోతి వేడకను కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్య కుటుంబం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే వీరి ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫోటో చూసిన అభిమానులు బాలకృష్ణ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ ఫోటోలో భాగంగా బాలకృష్ణ కాళ్లు మొత్తం తెల్లగా మారిపోయి ఉండడంతో అసలు బాలయ్య కాళ్లకు ఏమైంది? ఎందుకు అలా ఉన్నాయి? ఆయన ఆరోగ్యం బానే ఉంది కదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ ఆరోగ్యంపై అభిమానుల ఆందోళన

సినీ, రాజకీయాలలో బిజీగా బాలయ్య..

ఇలా బాలకృష్ణ కాళ్లు కాస్త విభిన్నంగా ఉన్న నేపథ్యంలోనే అభిమానులు కంగారు పడుతున్నారు. మరి బాలయ్య కాళ్లకు ఏమైంది? ఎందుకు అలా ఉన్నాయి? అనేది తెలియాలి అంటే బాలకృష్ణ లేదా ఆయన టీమ్ స్పందించాల్సి ఉంది. ఏడుపదుల వయసుకు చేరువ అవుతున్న బాలకృష్ణ నిత్యం ఎంతో చలాకీగా ఉంటారు .అలాంటిది ఈయన ఏదైనా సమస్యలతో బాధపడుతున్నారేమో అంటూ అభిమానులు సందేహ పడుతున్నారు. బాలకృష్ణ కేవలం సినిమా హీరోగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు ఈయన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు విజయం సాధించి ప్రజాసేవలో కూడా నిమగ్నమయ్యారు. ఇలా ఒక వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలలో ఈయన క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారనే చెప్పాలి.

Balakrishna legs enti ala unnayi ? https://t.co/hueK9BmgNx pic.twitter.com/1RFNnpRWsa

రాజకీయాల్లో, సినిమాల్లో బిజీగా బాలయ్య

— Hungry కుక్క 🐕 (@Truth_Exposer__) March 14, 2026

బాలకృష్ణ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించాల్సి ఉంది. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆయన రాబోయే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.