|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్.. ఏఐజీ బృందం బులెటిన్ విడుదల!

Published: 23-07-2026, 7:05 PM

నటసింహ నందమూరి బాలకృష్ణ షూటింగ్ సెట్లో ప్రమాదానికి గురై ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందారు. వైద్యులు మూడు గంటలపాటు శస్త్ర చికిత్స చేసి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు.

Key Points

1

బాలకృష్ణ ఎడమ మోకాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి

2

ఏఐజీ హాస్పిటల్ వైద్యులు మూడు గంటలపాటు ఆపరేషన్ చేశారు

4

బాలయ్యకు కొంతకాలం బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచన

బాలకృష్ణ ప్రమాదం వివరాలు

Balakrishna: నటసింహ నందమూరి బాలకృష్ణ ఇటీవల షూటింగ్ సెట్ లో ప్రమాదానికి గురై హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలయ్యకి ఏఐజి హాస్పిటల్ వైద్యులు దాదాపు మూడు గంటలపాటు శస్త్ర చికిత్స చేసి ఆయనకు ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ మేరకు హాస్పిటల్ బృందం ఒక బులెటిన్ విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ మోకాలికి దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్స ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తయింది అంటూ తెలిపారు.

ఈ మేరకు హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ బృందం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం…బాలకృష్ణ ఎడమ మోకాలిలోని క్వాడ్రిసెప్స్ టెండన్ గాయాన్ని నయం చేయడానికి ఈ శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆపరేషన్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని వైద్యులు తెలిపారు. బాలయ్య కి కొంతకాలం బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపారు. మొత్తానికి బాలయ్య ఎడమ మోకాలికి ఆపరేషన్ సక్సెస్ అయిందని తెలియడంతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

శస్త్ర చికిత్స విజయవంతం

నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. డిసెంబర్ 24న విడుదల చేయాలనే నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుతున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలోని కీలక సన్నివేశాల కోసం కాకినాడ పోర్టును ఎంచుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఈ సినిమాలో బాలయ్యపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో.. బాలయ్య స్టంట్ చేస్తూ ఒక్కసారిగా కాలుజారి కింద పడ్డారు. గాయపడిన ఆయనను వెంటనే చిత్ర బృందం స్పందించి, స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఎయిర్ లిఫ్ట్ సహాయంతో ఆయనను హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ కి తరలించారు. ఇకపోతే ఆయన ఎడమ మోకాలు చుట్టూ ఉన్న కణజాలాలలో రక్తం గడ్డ కట్టిందని, ఫలితంగా తీవ్రమైన వాపు వచ్చినట్లు పరీక్షలలో తేలిందని తెలిపారు. ఇది మజిల్ టేర్ ను సూచిస్తోందంటూ కూడా తెలిపారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ల బృంద పర్యవేక్షణలో విస్తృతమైన పరీక్షలు నిర్వహించి.. నేడు మూడు గంటల పాటు శ్రమించి ఆయనకు శస్త్ర చికిత్స పూర్తి చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ మోకాలికి ఆపరేషన్ సక్సెస్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య ఆరోగ్య పరిస్థితి

బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా విషయానికి వస్తే.. ఇందులో కాజల్ అగర్వాల్ మరోసారి ఆయన సరసన జతకట్టనుంది. ఈ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి కార్పెంటర్ అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ రెండు చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలను బాలయ్య లైన్లో పెట్టినట్లు సమాచారం. కొద్ది రోజులపాటు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పిన వైద్యులు.. ఆ తర్వాతే NBK 111 సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ విజయవంతం కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ తెరపై కనిపించాలని అందరూ ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.