
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, పద్మభూషణ్ అవార్డు, ‘అఖండ-2’ సినిమా విడుదల తేదీ, తన సామాజిక సేవల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Key Points
బాలయ్యకు పద్మభూషణ్ అవార్డును 'పొరపాటున' ఇచ్చారని వ్యాఖ్యానించారు.
ఈ బిరుదులు తనకు అలంకారం కాదని, తన సేవకు గుర్తుగా అందుకున్నట్లు తెలిపారు.
బాలయ్య 'అఖండ-2' చిత్రంతో సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
మెడిసిన్ చదవకపోయినా సినిమాల్లో డాక్టర్ పాత్రలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
బాలయ్య పుట్టినరోజు వేడుకలు
నందమూరి బాలకృష్ణ(Balakrishna) ‘అఖండ-2’(Akhanda-2) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘అఖండ’ సీక్వెల్‌గా రాబోతుంది. అయితే దీనిని సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు (జూన్ 10) బాలయ్య పుట్టిన రోజు కావడంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన మీ ముందు చెప్తున్నాను.
పద్మభూషన్ అవార్డ్ పొరపాటున ఇచ్చారు. అది నా నటనకు ఇచ్చింది కానీ నేను మాత్రం నా సేవకు ఈ అవార్డు ఇచ్చారు అనుకుంటాను. బిరుదులకు నేను అలంకారమేమో అనుకుంటారు. బిరుదులు నాకు అలంకారం కాదు. బిరుదులు వస్తుంటాయి. కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలి. నేను మెడిసిన్ ఎంట్రెన్స్ రాశాను. మెడిసిన్ చదవలేదు కానీ.. సినిమాల్లో డాక్టర్ పాత్రలు చేశాను. 15 ఏళ్ల క్రితం బసవతారకం ఆసుపత్రికి ఛైర్మన్ అయ్యాన్జ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించేలా కృషి చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పద్మభూషణ్ అవార్డుపై బాలయ్య అభిప్రాయం
‘అఖండ-2’ సినిమా విడుదల తేదీ
బాలకృష్ణ తన సినిమా జీవితం, సామాజిక సేవలు, పద్మభూషణ్ అవార్డు గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘అఖండ-2’ విడుదలకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.


