|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్య బాబు బిగ్ హార్ట్! మెగా ట్విన్స్ కి గ్రాండ్ గిఫ్ట్స్ తో సర్ ప్రైజ్ చేసిన నటసింహం!!

Published: 08-02-2026, 6:35 AM
బాలయ్య బాబు బిగ్ హార్ట్! మెగా ట్విన్స్ కి గ్రాండ్ గిఫ్ట్స్ తో సర్ ప్రైజ్ చేసిన నటసింహం!!
  • రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టిన సందర్భంగా బాలకృష్ణ కానుకలు.
  • బాలయ్య పంపిన కానుకల్లో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం, ప్రసాదం, ప్రత్యేక బొమ్మలు.
  • బాలయ్య మంచి మనసును కొనియాడుతున్న మెగా అభిమానులు, సోషల్ మీడియాలో పోస్టులు వైరల్.
  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ కొత్త సినిమా, వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది! రామ్ చరణ్, ఉపాసనలకు కవల పిల్లలు జన్మించడంతో నందమూరి బాలకృష్ణ తన పెద్ద మనసును చాటుకున్నారు. మెగా కుటుంబానికి ఆయన చేసిన సాయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మెగా ఇంట సందడి చేసిన బాలయ్య గిఫ్ట్స్!

Balakrishna: మెగా ఇంట సంబరాలు నెలకొన్న విషయం తెలిసిందే. జనవరి 31న రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనించిన విషయం తెలిసిందే. అందులో ఒకరు పాప, ఒకరు బాబు అవడం విశేషం. ఈ న్యూస్ కేవలం మెగా కుటుంబంలోనే కాదు, మెగా ఫ్యాన్స్ లో కూడా ఆనందాన్ని నింపింది. దీంతో, మెగా ఫ్యాన్స్ అంతా టపాసులు కలుస్తూ, కేకులు కట్ చేస్తూ నానా హంగామా చేశారు.

ట్విన్స్ కోసం బాలయ్య పంపిన ప్రత్యేక కానుకలు!

అయితే, ఈ సందర్బంగా నందమూరి బాలకృష్ణ(Balakrishna) తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. రామ్ చరణ్- ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ పుట్టిన కవల పిల్లలకు కానుకలు పంపిచాడట బాలయ్య. వాటిలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం, తిరుమల ప్రసాదం, పసిపిల్లల కోసం ప్రత్యేకమైన బొమ్మలు ఉండటం విశేషం. ఆ బహుమతి చూసి మెగా కుంటుంబం ముఖ్యంగా రామ్ చరణ్- ఉపాసన చాలా ఆనందం వ్యక్తం చేశారట.

బాలయ్య మనసుపై మెగా ఫాన్స్ ప్రశంసలు!

ఇక ఈ న్యూస్ తెలియడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాలకృష్ణపై ప్రశంసలు కుపిస్తూ పోస్టులు పెడుతున్నారు. మరోపక్క బాలకృష్ణ మంచి మనసు గురించి వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక సినిమాల విషయానికి వస్తే, రీసెంట్ గా అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ఇప్పుడు దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఈ సిఎంమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

బాలకృష్ణ మంచి మనసును అందరూ ప్రశంసిస్తున్నారు. ఆయన సినిమాలతో పాటు వ్యక్తిత్వం కూడా ఎంతో గొప్పదని అంటున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.