|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలకృష్ణ `తల్లిదండ్రులు` మూవీకి పోటీగా వచ్చి ఖంగుతిన్న సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? వాళ్లిద్దరికి ఇప్పటికీ పడదట

Published: 19-07-2025, 10:31 AM
బాలకృష్ణ `తల్లిదండ్రులు` మూవీకి పోటీగా వచ్చి ఖంగుతిన్న సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? వాళ్లిద్దరికి ఇప్పటికీ పడదట

తెలుగు సినిమా పరిశ్రమలో పోటీ సర్వసాధారణం. ఈ కథనంలో 1991లో బాలకృష్ణ ‘తల్లిదండ్రులు’, నాగార్జున ‘నిర్ణయం’ సినిమాల మధ్య జరిగిన పోటీ, మరియు వారి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం.

Key Points

1

బాలకృష్ణ 'తల్లిదండ్రులు' సినిమా భారీ విజయం సాధించింది.

2

నాగార్జున 'నిర్ణయం' సినిమా థియేటర్లలో ఆకట్టుకోలేదు.

4

బాలకృష్ణ, నాగార్జునల మధ్య ఇప్పటికీ గ్యాప్ ఉందని వార్తలు.

తల్లిదండ్రులు సినిమా విజయం

ఇండస్ట్రీలో చాలా మంది హీరోల మధ్య పోటీ కామన్‌గానే ఉంటుంది. సక్సెస్‌ కోసం పోటీపడటం సర్వసాధారణమే. వారి సినిమాలు పోటీ పడటం కూడా రెగ్యూలర్‌గానే జరుగుతుంది. ఒక వారం ఒక హీరో సక్సెస్‌ కొడితే మరో వారం మరో హీరో సక్సెస్‌ కొడతారు.

కానీ పోటీగా వచ్చినప్పుడు ఎవరు హిట్‌ కొట్టారనేది అత్యంత ఆసక్తికరంగా మారుతుంది. అయితే ఇలాంటి పోటీ బాలయ్యకి `తల్లిదండ్రులు` సినిమా విషయంలో జరిగింది. ఆయనకు పోటీగా వచ్చిన మరో స్టార్‌ హీరో సినిమా గట్టిగా దెబ్బతిన్నది. మరి ఆ హీరో ఎవరో చూస్తే.

టాలీవుడ్‌లో బిగ్‌ స్టార్స్ గా రాణిస్తున్నారు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున. ఒకప్పుడు వీరిద్దరు ఎంతో స్నేహంగానే ఉండేవారు. ఒకరి సినిమా ఈవెంట్లకి మరొకరు వెళ్లడం, ఒకరి సినిమా ఓపెనింగ్‌లకు మరొకరు గెస్ట్ గా హాజరు కావడం జరిగింది.

కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చింది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుందనేది ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపించే మాట. పదేళ్ల క్రితం ఓ ఈవెంట్లో తమ మధ్య ఏం లేదని చెప్పారు. కానీ ఆ గ్యాప్‌ ని ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాలు ఇప్పటికీ ఫీల్‌ అవుతూనే ఉన్నారు.

1991లో బాలకృష్ణ, నాగార్జున సినిమాల మధ్య పోటీ నెలకొంది. ఆ ఏడాది ఫిబ్రవరిలో బాలయ్య నటించిన `తల్లిదండ్రులు` సినిమా, నాగార్జున నటించిన `నిర్ణయం` మూవీ‌ పోటీపడ్డాయి.

నిర్ణయం సినిమా వైఫల్యం

బాలకృష్ణ హీరోగా, విజయశాంతి హీరోయిన్‌గా రూపొందిన `తల్లిదండ్రులు` చిత్రానికి టి రామారావు దర్శకుడు. ప్రసాద్‌ ఆర్ట్స్ పిక్చర్స్ పై ఏవీ సుబ్బారావు నిర్మించారు.

ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలైంది. భారీ విజయాన్ని సాధించింది. సినిమాకి ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా కదిలి వచ్చారు. దీంతో ఇది పెద్ద హిట్‌ అయ్యింది.

`తల్లిదండ్రులు` సినిమాకి 12 రోజుల తర్వాత (ఫిబ్రవరి 21న) నాగార్జున నటించిన `నిర్ణయం` సినిమా విడుదలయ్యింది. ఇందులో నాగార్జునకి జోడీగా అమల హీరోయిన్‌గా నటించగా, ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించారు.

జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై డి కిశోర్‌ నిర్మించారు. ఇది థియేటర్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. జనం ఆసక్తి చూపించలేదు. దీంతో రిలీజ్‌ అయిన రెండో రోజు నుంచే చాలా థియేటర్లు ఎత్తేశారట.

బాలకృష్ణ, నాగార్జునల మధ్య సంబంధం

బాలయ్య సినిమాకి జనం ఆసక్తి చూపించడంతో `నిర్ణయం` మూవీ స్థానంలో `తల్లిదండ్రులు` ప్రదర్శించారట. అలా బాలయ్యకి పోటీగా వచ్చి ఖంగుతిన్నారు నాగ్‌ .

`నిర్ణయం` సినిమా రావడానికి ముందే నాగ్‌ నటించిన హిందీ `శివ` విడుదలైంది. నాగార్జున, వర్మ కాంబినేషన్‌లో తెలుగులో వచ్చిన `శివ`కిది హిందీ రీమేక్‌.

తెలుగు మాదిరిగానే హిందీలో కూడా పెద్ద విజయం సాధించింది. ఆ సక్సెస్‌ ఆనందంలో ఉన్న నాగ్‌కి `నిర్ణయం` పెద్ద షాకిచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత నాగ్‌ నుంచి వచ్చిన చిత్రాలు కూడా ఆడలేదు.

ఆ ఏడాది నాలుగు సినిమాలు విడుదల కాగా, ఒక్కటి కూడా హిట్‌ కాలేదు. అలా ఆ ఏడాది మన్మథుడికి కలిసి రాలేదని చెప్పొచ్చు. ఆ నెక్ట్స్ ఇయర్‌ `కిల్లర్‌` చిత్రంతో హిట్‌ అందుకున్నారు నాగ్‌. మళ్లీ బౌన్స్ బ్యాక్‌ అయ్యారు.

చివరగా, 1991లో విడుదలైన ‘తల్లిదండ్రులు’, ‘నిర్ణయం’ సినిమాల మధ్య పోటీ, బాలకృష్ణ, నాగార్జునల మధ్య సంబంధం ఇప్పటికీ ఆసక్తికరమైన చర్చాంశం. ఈ పోటీ తెలుగు సినీ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.