|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్యూటీ విత్ వయోలెన్స్ డెడ్లీ కాంబినేషన్.. ఈమెతో పెట్టుకుంటే చావే.. ఓటీటీలోకి వచ్చిన బాలెరినా యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులో చూడండి!

Published: 05-09-2025, 8:16 PM

జాన్ విక్ స్ఫూర్తితో తెరకెక్కిన బాలెరినా సినిమా ఓటీటీలోకి వచ్చింది. అనా డి అర్మాస్ నటన, వయోలెంట్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో చూడండి!

Key Points

1

బ్యూటీఫుల్ హీరోయిన్ అనా డి అర్మాస్ ప్రధాన పాత్ర.

2

హై ఓల్టేజ్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్.

4

అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమింగ్.

బాలెరినా: జాన్ విక్ స్ఫూర్తి

జాన్ విక్.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. యాక్షన్‌ కొరియోగ్రఫీ సరికొత్త అర్థం చెప్పిన మూవీ ఫ్రాంచైజీ ఇది. భార్య కుక్కను చంపినవాడి మీద హీరో రివేంజ్ తీర్చుకునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను తెచ్చిపెట్టింది.

ఇక జాన్ విక్‌గా స్టైలిష్ యాక్షన్ స్టంట్స్‌తో అదరగొట్టిన కీను రీవ్స్ మ్యాట్రిక్స్ మూవీ సిరీస్ తర్వాత అంతకుమించి పేరు తెచ్చుకున్నాడు. బాబా యాగాకా కీను రీవ్స్ నటించిన జాన్ విక్ స్ఫూర్తితో తెలుగులో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. అలాగే, జాన్ విక్ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికీ నాలుగు సినిమాలు వచ్చాయి.

ఎంతో క్రేజ్ తెచ్చుకున్న జాన్ విక్ ఫ్రాంచైజీ నుంచి స్పిన్నాఫ్‌గా వచ్చిన సినిమానే ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ జాన్ విక్ బాలెరినా. బ్యూటిఫుల్ హీరోయిన్ అనా డి అర్మాస్ ప్రధాన పాత్రలో హై ఓల్టేజ్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా బాలెరినా సినిమాను తెరకెక్కించారు.

అనా డి అర్మాస్ యాక్షన్

బ్యూటీ విత్ వయోలెన్స్ డెడ్లీ కాంబినేషన్ అనేలా గ్లామర్‌గా కనిపించే హీరోయిన్ ఇందులో శత్రువులతో రక్తపాతం సృష్టిస్తుంది. ఈవ్ మకారో పాత్రలో నటించిన అనాతో పెట్టుకున్న వాళ్లకు చావే అన్నట్లుగా సీన్స్, రక్తపాతం, వయోలెన్స్, యాక్షన్ ఉంటాయి.

జూన్ 6న థియేటర్లలో విడుదలైన బాలెరినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది. అయితే, జాన్ విక్ రేంజ్‌లో మాత్రం టాక్ తెచ్చుకోలేకపోయింది. ఒక రివేంజ్ స్టోరీ, పగతో శత్రువులను చంపే కిల్లర్ లేడి, తనను చంపేందుకు తన గురువు లాంటి జాన్ విక్ ఎదురుపడటం వంటి సీన్లతోనే రెగ్యులర్ ఫార్మాట్‌లో సాగుతుంది.

కానీ, యాక్షన్ థ్రిల్లర్స్‌లో ఎక్కువగా అట్రాక్ట్ చేసేవి ఫైట్ సీక్వెన్సే. అవి ఎంత క్రేజీగా ఉంటే ఆడియెన్స్ అంత థ్రిల్ అవుతారు. అందులో బాలెరినా మెప్పించింది కాబట్టే 137.3 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. అలాంటి బాలెరినా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగులో బాలెరినా ఓటీటీ రిలీజ్ అయింది.

ఓటీటీ రిలీజ్ వివరాలు

అమెజాన్ ప్రైమ్‌లో ఎలాంటి రెంటల్ విధానం లేకుండా ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ జాన్ విక్ బాలెరినా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 4న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠి వంటి ఐదు భాషల్లో బాలెరినా ఓటీటీ రిలీజ్ అయింది.

కాగా, షయ్ హట్టెన్ కథ అందించిన బాలెరినా సినిమాకు లెన్ వైస్‌మ్యాన్ దర్శకత్వం వహించారు. ఇక వయోలెంట్ యాక్షన్ సీన్స్ ఇష్టపడేవారు ప్రైమ్ వీడియో ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోన్న బాలెరినా సినిమాపై లుక్కేయవచ్చు.

అనా డి అర్మాస్ అద్భుతమైన యాక్షన్ తో ఆకట్టుకునే బాలెరినా సినిమా ఇప్పుడు తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. వీక్షించి ఆనందించండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.