|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రవితేజకు బండ్ల గణేష్ చేతిలో మోసం! అసలు ఏం జరిగిందో తెలుసా?

Published: 12-03-2026, 9:05 AM
షాకింగ్: రవితేజకు బండ్ల గణేష్ చేతిలో మోసం! అసలు ఏం జరిగిందో తెలుసా?
  • రవితేజకు బండ్ల గణేష్ భారీ మోసం… స్థలం విషయంలో అసలు నిజం బయటపెట్టిన నిర్మాత!
  • ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్… రవితేజతో అనుబంధం వెల్లడి!
  • చిరంజీవి సినిమాలో బండ్ల గణేష్ నటన… మళ్లీ బిజీ అవుతున్న స్టార్ ప్రొడ్యూసర్!
  • రవితేజ స్థలం కొనుగోలుపై బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్… ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

టాలీవుడ్ లో సంచలనం! నిర్మాత బండ్ల గణేష్, రవితేజకు మోసం చేశాడా? ఈ షాకింగ్ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం!

రవితేజను మోసం చేసిన బండ్ల గణేష్?

బండ్ల గణేష్ నటుడిగా కెరీర్ను మొదలుపెట్టి ఆ తర్వాత నిర్మాతగా పలు సినిమాలను నిర్మించారు. ఈయన తన కెరీర్లో నిర్మించినది తక్కువ సినిమాలే అయినా కూడా అవి ఆల్మోస్ట్ స్టార్ హీరోలతో మాత్రమే కావడం విశేషం. మాస్ మహారాజా రవితేజ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఆంజనేయులు మూవీతో ఈ నటుడు నిర్మాతగా తన కెరీర్ను మొదలు పెట్టాడు.

ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా…

ఆ తర్వాత తీన్‌మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ నటన మరియు సినిమాలు నిర్మించడం విషయంలో కూడా చాలా స్లో అయ్యాడు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి హీరోగా రూపొందబోయే సినిమాలో నటిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. అలాగే నాకు చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి, కానీ వచ్చిన ప్రతి సినిమాలో నటించాలి అనే కోరిక నాకు లేదు. ప్రస్తుతం నేను చాలా పనులతో బిజీగా ఉన్నాను, కేవలం నాకు నచ్చిన సినిమాల్లో మాత్రమే నటిస్తాను అని తెలియజేశాడు.

చిరంజీవి సినిమాలో బండ్ల గణేష్!

బండ్ల గణేష్ చాలా కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అందులో ఈ నిర్మాత… నాకు ఎంతో నచ్చిన మనిషి, నటుడు రవితేజ. కానీ ఆయనను ఓ విషయంలో నేను మోసం చేశాను. కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ గారి దగ్గర ఉన్న ఒక స్థలాన్ని ప్రభుత్వం అక్యూజేషన్ చేస్తుందని అబద్ధం చెప్పి కొనుగోలు చేశాను. ఆ తర్వాత ఆ విషయం ఆయనకు చెప్పాను, ఆయన సీరియస్ అవుతారు అనుకున్నాను. కానీ నాకు ఆ విషయం ముందే తెలుసు అని చాలా ఫన్నీగా తీసుకున్నారు. అంత గొప్ప మనసు ఆయనది అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.

బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవితేజ, బండ్ల గణేష్‌ల మధ్య సంబంధాలపై మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.