
వచ్చే వారం బ్యాంకులో మీకు ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే అలర్ట్! జూన్ 25 నుండి 28 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు రానున్నాయి. మొహర్రం పండుగ, వారాంతపు సెలవుల కారణంగా ఈ విరామం వస్తోంది.
Key Points
జూన్ 25 నుండి 28 వరకు బ్యాంకులకు వరుసగా నాలుగు రోజుల సెలవులు.
మొహర్రం, నాలుగో శనివారం, ఆదివారం కారణంగా ఈ సెలవులు.
కొన్ని సెలవులు ప్రాంతీయంగా ఉండగా, నాలుగో శనివారం దేశవ్యాప్తంగా వర్తిస్తుంది.
ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు ఉన్నవారు ముందుగానే చూసుకోవాలి.
వరుసగా 4 రోజులు సెలవులు: కారణాలు ఏంటి?
మీకు వచ్చే వారం బ్యాంకులో ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు ఈ వార్త తప్పక చదవాలి. రాబోయే వారంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి! జూన్ 22 నుంచి జూన్ 28 మధ్య వారంలో ఈ సెలవులు వస్తున్నాయి. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ వంటి ఏ బ్యాంకు శాఖకైనా వెళ్లే ముందు ఈ సెలవుల జాబితాను ఒక్కసారి సరిచూసుకోవడం మంచిది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారిక హాలిడే క్యాలెండర్ ప్రకారం.. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన పండుగలతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం- ఆదివారాల సెలవులను కలుపుకుని ఈ జూన్ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే వారం బ్యాంకులకు వరుసగా 4 హాలీడేలు లభిస్తున్నాయి. కొన్ని సెలవులు నిర్దిష్ట రాష్ట్రాలు లేదా ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాగా, ప్రభుత్వ గెజిటెడ్ సెలవుల రోజుల్లో మాత్రం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు శాఖలు మూతపడతాయి.
వచ్చే వారం జూన్ 25, 26, 27, 28 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. మొహర్రం పండుగ, వారాంతపు సెలవుల (వీకెండ్) కారణంగా ఈ నాలుగు రోజుల విరామం వస్తోంది.
జూన్ 25 (గురువారం): మొహర్రం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ రీజియన్ పరిధిలో బ్యాంకులు పనిచేయవు.
జూన్ 26 (శుక్రవారం): మొహర్రం పండుగ కారణంగా హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై, ముంబై, దిల్లీ, కోల్‌కతా, బెలాపూర్, భోపాల్, అగర్తలా, ఐజ్వాల్, జమ్మూ, కాన్పూర్, లక్నో, నాగ్‌పూర్, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్ వంటి ప్రధాన నగరాల్లో బ్యాంకులు మూతపడతాయి.
జూన్ 27 (శనివారం): ఇది నెలలోని నాల్గొవ శనివారం కావడం వల్ల దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు సాధారణ సెలవును పాటిస్తాయి.
ఏ నగరాల్లో బ్యాంకులు బంద్?
జూన్ 28 (ఆదివారం): దేశవ్యాప్తంగా ఆదివారం సాధారణ వీకెండ్ సెలవు ఉంటుంది.
జూన్ 29 (సోమవారం) : సంత్ గురు కబీర్ జయంతి- శిమ్లాలోని బ్యాంకులకు సెలవు.
జూన్ 30 (మంగళవారం) : రెమ్నా నీ- ఐజ్వాల్‌లోని బ్యాంకులకు సెలవు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. దేశంలోని అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు ప్రతి నెలలోని రెండవ శనివారం, నాల్గొవ శనివారంతో పాటు అన్ని ఆదివారాల్లో విధిగా మూతపడాలి. ఈ రోజుల్లో వినియోగదారులకు బ్యాంకు శాఖల్లో నేరుగా ఎలాంటి సేవలు లభించవు. ఈ జూన్ నెలలో మొత్తం నాలుగు ఆదివారాలు వచ్చాయి. ఈ కారణంగా జూన్ 7, 14, 21. 28 తేదీల్లో బ్యాంకులకు సెలవు. వీటికి తోడు జూన్ 13 (రెండో శనివారం), జూన్ 27 (నాల్గవ శనివారం) రోజుల్లో కూడా బ్యాంకులు మూతపడతాయి.
స్థానికంగా ఉండే పండుగలు, సెలవుల వివరాల కోసం వినియోగదారులు తమ పరిధిలోని బ్యాంకు శాఖలను సంప్రదించవచ్చు. అయితే, బ్యాంకు శాఖలు భౌతికంగా మూతపడినప్పటికీ, దేశవ్యాప్తంగా అవసరమైన డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా యథావిధిగా పనిచేస్తాయి.
ఆర్బీఐ మార్గదర్శకాలు: తెలుసుకోవాల్సిన విషయాలు
బ్యాంకు సెలవు దినాల్లో కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. దీనివల్ల వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీలను ఎక్కడి నుండైనా సులభంగా పూర్తి చేసుకోవచ్చు.
డబ్బులు పంపడానికి లేదా వేరొకరి నుంచి డబ్బులు స్వీకరించడానికి యూపీఐ లేదా సంబంధిత బ్యాంకు మొబైల్ యాప్‌లను ఉపయోగించవచ్చు. ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అయితే, కొన్నిసార్లు బ్యాంకులు ముందస్తుగా ప్రకటించే మెయింటెనెన్స్ సమయంలో మాత్రం ఈ సేవలు తాత్కాలికంగా నిలిచిపోవచ్చు.
నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ అభ్యర్థనలు, డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రిక్వెస్ట్ ఫారమ్‌లు, చెక్‌బుక్ దరఖాస్తులను కూడా ఆన్‌లైన్ ద్వారా ప్రాసెస్ చేయవచ్చు.
ఇవే కాకుండా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏటీఎం సేవల ద్వారా నగదు విత్‌డ్రా లేదా చెల్లింపులు చేసుకోవచ్చు. అకౌంట్ నిర్వహణ, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ సెటప్ చేయడం, లాకర్ కోసం అప్లై చేసుకునే సేవలు కూడా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటాయి.
కాబట్టి, మీ బ్యాంకింగ్ లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. సెలవుల జాబితాను ఒకసారి సరిచూసుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ పనులను పూర్తి చేసుకోండి.


