
📌 Key Points
- ‘బ్యూటీ’ సినిమా జనవరి 2న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
- అంకిత్ కొయ్య, నిలఖి పాత్రా, వీకే నరేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.
- కూతురిపై తండ్రి ప్రేమ, వారి మధ్య ఘర్షణ, ప్రేమకథ సినిమాకు కీలకం.
- కోపంతో తీసుకున్న నిర్ణయాలు అలేఖ్య జీవితాన్ని ఎలా మార్చాయో కథాంశం.
జీ5లో మరో కొత్త సినిమా ‘బ్యూటీ’ జనవరి 2న స్ట్రీమింగ్ కానుంది. అంకిత్ కొయ్య, నిలఖి పాత్రా నటించిన ఈ ఎమోషనల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా థియేటర్లలో ప్రశంసలు పొందింది. తండ్రి-కూతురు బంధం, ప్రేమ కథాంశంతో సాగే ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది.
జీ5లో ‘బ్యూటీ’ స్ట్రీమింగ్ వివరాలు
ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లతో వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తూ దేశంలోనే టాప్ ఓటీటీ మాద్యమాల్లో ఒకటిగా గుర్తింపు సంపాదించుకున్న జీ 5.. మరోసారి తన విలక్షణతను చాటుకుంటూ కొత్త సినిమా ‘బ్యూటీ’తో ప్రేక్షకులకు అందిస్తోంది. డిఫరెంట్ మూవీస్‌లో నటిస్తూ మెప్పిస్తోన్న అంకిత్ కొయ్య(Ankit Koyya) హీరోగా, నిలఖి పాత్రా(Nilakhi Patra) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం జీ 5లో జనవరి 2 నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన విడుదల చేసింది. హృదయాన్ని హత్తుకునే క్యూట్ లవ్‌స్టోరీ ఓ వైపు.. కూతురిపై అపరిమితమైన ప్రేమను చూపించే తండ్రి భావోద్వేగం మరో వైపు.. ఈ సంఘర్షణలో కథ ఎలాంటి మలుపులు తీసుకుందనే ఆసక్తికరమైన మలుపులున్న కథాంశంతో ‘బ్యూటీ’ (Beauty)సినిమా రూపొందింది. సెప్టెంబర్ 15న విడుదలైన ఈ చిత్రం థియేటర్స్‌లో ప్రేక్షకుల ప్రశంసలను అందుకుని ఇప్పుడు జీ 5లో జనవరి 2 నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది.
స్టోరీ విషయానికొస్తే.. అలేఖ్య (నిలఖి పాత్రా), అర్జున్ (అంకిత్ కొయ్య) ప్రేమించుకుంటారు. అలేఖ్య తండ్రి నారాయణ (వీకే నరేష్) ఓ క్యాబ్ డ్రైవర్. కూతురంటే మాటల్లో చెప్పలేని ప్రేమ. కూతురికి బర్త్ డే గిఫ్ట్‌గా టూ వీలర్ బండిని కొనిస్తానని ప్రామిస్ చేస్తాడు. అలాగే అర్జున్ కూడా ఆమెకు బండి కొనిస్తానని ప్రామిస్ చేస్తాడు. తండ్రి మాటపై నిలబడకపోవటంతో అలేఖ్య తండ్రితో గొడవపడి వెళ్లిపోతుంది. అర్జున్, నారాయణ ఆమె నిర్ణయంతో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. కోపంతో తీసుకున్న నిర్ణయం అలేఖ్యను ఎలాంటి ఇబ్బందుల్లో పడేసింది..నారాయణ కూతుర్ని కాపాడుకోవటానికి ఏం చేస్తాడు? చివరకు ఆమె ఎలా బయటపడిందనేదే సినిమా కథాంశం.
‘బ్యూటీ’ సినిమా కథాంశం ఏంటి?
ముఖ్య తారాగణం, వారి పాత్రలు
హృదయాన్ని హత్తుకునే తండ్రి-కూతురు అనుబంధం, ఆసక్తికరమైన ప్రేమకథతో రూపొందిన ‘బ్యూటీ’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. జనవరి 2న జీ5లో ఈ భావోద్వేగ డ్రామాను చూసి ఆనందించండి.


