|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బెల్లంకొండ పెళ్లి వెనుక షాకింగ్ నిజాలు! కావ్య రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఊహించని ట్విస్ట్!

Published: 30-04-2026, 9:34 AM
బెల్లంకొండ పెళ్లి వెనుక షాకింగ్ నిజాలు! కావ్య రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఊహించని ట్విస్ట్!
  • యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కావ్య రెడ్డిని తిరుమల శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకున్నారు.
  • హైదరాబాద్ ప్రముఖ న్యాయవాది కుమార్తె కావ్య రెడ్డికి సినీ నేపథ్యం లేకపోవడం విశేషం.
  • కావ్య రెడ్డి సోదరి ద్వారా పరిచయం.. ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
  • వైరల్ అవుతున్న కొత్త జంట పెళ్లి ఫోటోలు.. అభిమానుల నుంచి భారీ స్పందనతో దూసుకుపోతున్నాయి.

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి గురించే చర్చ! ఈ యంగ్ హీరో ఓ ఇంటివాడు కావడం పట్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే, ఆయన భార్య కావ్య రెడ్డి బ్యాక్‌గ్రౌండ్, వారి ప్రేమకథపై సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ ప్రత్యేక వివరాలు మీకోసం!

బెల్లంకొండ భార్య బ్యాక్‌గ్రౌండ్ రివీల్!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఓ ఇంటివాడు అయ్యాడు. కావ్యరెడ్డిని ఆయన మ్యారేజ్‌ చేసుకున్నారు. గురువారం తెల్లవారు జామున తిరుమల శ్రీవారి సమక్షంలో వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి మ్యారేజ్‌ జరగడం విశేషం. అంగరంగ వైభవంగా వీరి వివాహం జరగడం విశేషం. బెల్లం కొండ సాయి శ్రీనివాస్‌.. అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌ పెద్ద కొడుకు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కావ్య రెడ్డి మ్యారేజ్‌ ఫోటోలు బయటకు వచ్చాయి. తన భార్య ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు సాయిశ్రీనివాస్‌. ఇందులో ఈ కొత్త జంట ఎంతో అందంగా ఉంది.

అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రేమకథ!

వీరిద్దరు తమ పెళ్లి సందర్భంగా మురిసిపోతున్నారు. ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా బెల్లంకొండ మ్యారేజ్‌ చేసుకున్న కావ్య రెడ్డి బ్యాక్‌ గ్రౌండ్‌ గురించి తెలుసుకుంటే, ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య కావ్య రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ న్యాయవాది కుమార్తె. ఆమెకు సినీ రంగానికి ఎలాంటి సంబంధం లేదు. కావ్య రెడ్డి కూడా లా చేశారు. తనే కాదు, తన తాత కూడా న్యాయమూర్తి కావడం విశేషం. మొత్తంగా బెల్లంకొండ లాయర్‌ని పెళ్లి చేసుకున్నారని చెప్పొచ్చు.

తిరుమలలో గ్రాండ్‌గా జరిగిన పెళ్లి!

కావ్య రెడ్డి సిస్టర్‌.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఒకే కాలేజీలో చదువుకున్నారట. ఆమె ద్వారా చెల్లి పరిచయం అయ్యింది. అది వీరి మధ్య ప్రేమకు దారితీసింది. కొన్నాళ్లపాటు సాగిన ఈ ప్రేమకి పెద్దలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో మ్యారేజ్‌ ఫిక్స్ చేసుకున్నారు. మార్చిలో ఈ ఇద్దరికి రోకా వేడుక జరగ్గా, ఏప్రిల్‌ 5 ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. నేడు ఏప్రిల్‌ 30న తిరుమలలో వివాహం చేసుకున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ టాలీవుడ్‌లో హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన `అల్లుడుశీను`తో హీరోగా పరిచయం అయ్యాడు. `స్పీడున్నోడు, `జయ జానకి నాయక`, `సాక్ష్యం, `కవచం`, `సీత`, `రాక్షసుడు`, `అల్లుడు అదుర్స్, `ఛత్రపతి`(హిందీ), భైరవం`, `కిష్కింధపురి` చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు `టైసన్‌ నాయుడు` మూవీలో నటిస్తున్నాడు. `హైంధవ` మూవీలో నటిస్తున్నాడు.

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త జంట భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారి జీవిత విశేషాలు, సినిమా అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.