|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bhagyashree Borse: బర్త్‌డే స్పెషల్ ట్రీట్.. భాగ్యశ్రీ బోర్సే సినిమాల నుంచి వరుస అప్‌డేట్స్

Published: 06-05-2025, 11:25 AM

సోషల్ మీడియాలో ప్రజాదరణ పొందుతున్న నటి భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు సందర్భంగా ఆమె నటించిన సినిమాల నుంచి కొత్త లుక్స్, అప్డేట్స్ విడుదల అయ్యాయి. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ నటి ప్రస్తుతం అనేక సినిమాల్లో నటిస్తోంది.

Key Points

1

భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు సందర్భంగా ఆమె సినిమాల నుంచి లుక్స్ రిలీజ్.

2

RAPO22, కింగ్‌డమ్, కాంత చిత్రాల్లో భాగ్యశ్రీ నటన.

3

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న భాగ్యశ్రీ.

4

టాలీవుడ్‌లో బిజీగా ఉన్న యువ నటి.

భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు వేడుకలు

ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరోయిన్స్‌లో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) ఒకరు. ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం అభినయంతో ఎంతో మంది యూత్‌ను తనవైపు తిప్పుకుంది. దీంతో ప్రజెంట్ వరుస ఆఫర్లు అందుకుంటూ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరుగా దూసుకుపోతుంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ పోతునేని (Ram Pothuneni) ‘RAPO22’లో.. అలాగే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘కింగ్‌డమ్’తో పాటు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ‘కాంత’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే.. ఈ రోజు భాగ్యశ్రీ బోర్సే పుట్టిన రోజు కావడంతో ఆమె నటిస్తున్న సినిమాల నుంచి వరుసగా లుక్స్ రిలీజ్ చేస్తూ… ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఈ మేరకు ‘RAPO22’, ‘కింగ్‌డమ్’, ‘కాంత’ సినిమాల నుంచి లుక్స్ రిలీజ్ చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్టర్లు షేర్ చేశారు. అందులో భాగ్యశ్రీ బోర్సే క్యూట్ లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

వరుస సినిమా అవకాశాలు

A post shared by Spirit Media (@thespiritmedia)

సినిమాల నుంచి కొత్త లుక్స్

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

మొత్తం మీద, భాగ్యశ్రీ బోర్సే తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తూ, టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తుంది. ఆమె భవిష్యత్ సినిమాలకు శుభాకాంక్షలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.