|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్ రాజా ఫ్యాన్స్‌కు పూనకాలే! ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! 🔥

Published: 09-03-2026, 4:35 AM
  • మాస్ రాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
  • జీ5 ఓటీటీలో మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం, ఇక పండగే పండగ!
  • రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయతిల అందాల విందు
  • కిశోర్ తిరుమల దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్, థియేటర్లలో పర్వాలేదనిపించిన మూవీ

మాస్ మహారాజ రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

జీ5లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ స్ట్రీమింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఆషికా రంగనాథ్, డింపుల్‌ హయతిలు హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మాణంలో కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సత్య, వెన్నెల కిషోర్, మురళీధర్, సునీల్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతికి జనవరి 13న థియేటర్స్ లో రిలీజ్ అయింది

రవితేజ కామెడీ టైమింగ్ అదుర్స్ అంతే!

ఈ సినిమా థియేటర్స్ లో పర్వాలేదనిపించింది. ఇరువురి భామల మధ్య హీరో నలిగిన కామెడీ కథాంశంతో ఈ సినిమాని టీకెక్కించారు. అయితే సూపర్ హిట్ అయిన సినిమాలే నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఇంకా రాలేదేంటి అని ఆశ్చర్యపోతున్నారు. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఓటీటీ రైట్స్ జీ5 కొనుక్కుంది.

మార్చి 13 నుంచి ఓటీటీలో సందడి!

పలు కారణాలతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పలుమార్లు వాయిదా పడగా ఎట్టకేలకు నేడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మార్చి 13 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ఓటీటీ రిలీజ్ తో మాస్ రాజా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.