|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ సంచలనం: డిమాన్ పవన్ జాక్ పాట్.. రూ. 15 లక్షలు తీసుకుని షాకింగ్ ఎగ్జిట్!

Published: 21-12-2025, 9:44 AM
బిగ్ బాస్ సంచలనం: డిమాన్ పవన్ జాక్ పాట్.. రూ. 15 లక్షలు తీసుకుని షాకింగ్ ఎగ్జిట్!
  • బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఘనంగా ప్రారంభమైంది, టాప్ 5 కంటెస్టెంట్లతో సందడి.
  • డిమాన్ పవన్ రూ. 15 లక్షలు తీసుకుని విన్నర్ రేసు నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
  • ఈ నిర్ణయం పవన్‌కు జాక్ పాట్, తెలివైన ఎత్తుగడ అని విశ్లేషకుల అభిప్రాయం.
  • రీతూతో ఎఫైర్, గేమ్స్‌లో పోరాటంతో ఈ సీజన్‌లో డిమాన్ హైలైట్ కంటెస్టెంట్లలో ఒకడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఉత్కంఠగా సాగుతోంది. ఈ క్రమంలో టాప్ 5 కంటెస్టెంట్ డిమాన్ పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారీ మొత్తం రూ. 15 లక్షలు తీసుకుని విన్నర్ రేసు నుంచి తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది నిజంగా జాక్ పాటేనా?

డిమాన్ పవన్ సంచలన నిర్ణయం!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఘనంగా ప్రారంభమైనది. కింగ్ నాగార్జున రాయల్ ఎంట్రీ ఇచ్చారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ డయాస్ పై సందడి చేశారు. టాప్ 5 లో ఉన్న కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజన, డిమాన్ పవన్ అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ తో ఎంట్రీ ఇచ్చారు. విజేత ఎవరనేది మరికాసేపట్లో తేలిపోనుంది.

జాక్ పాట్ కొట్టి విన్నర్ రేసు నుంచి ఔట్!

పవన్  ఇదిలా ఉండగా ముందుగా అందుతున్న సమాచారం మేరకు బిగ్ బాస్ విన్నర్ రేసు నుంచి డిమాన్ పవన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. టాప్ 5 నుంచి ఇప్పటికి ఇప్పుడు తప్పుకుంటే రూ. 15 లక్షలు ఇస్తాం అని ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ కి డిమాన్ పవన్ అంగీకారం తెలిపారు.

పవన్ తీసుకున్నది తెలివైన ఎత్తుగడేనా?

దీనితో 15 లక్షలు తీసుకుని పవన్ విన్నర్ రేసు నుంచి తప్పుకున్నాడు. ఇది డిమాన్ కి జాక్ పాట్ అనే చెప్పాలి. ఒక్క దెబ్బకి 15 లక్షలు అంటే మాటలు కాదు. విన్నర్ రేసులో పవన్ లేడు. టాప్ 3 లేదా టాప్ 4 లో ఉంటాడు. కాబట్టి పవన్ తీసుకున్నది తెలివైన నిర్ణయమే అని అంటున్నారు. ఈ సీజన్ లో హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లో డిమాన్ ఒకరు. రీతూతో ఎఫైర్, గేమ్స్ లో గట్టిగా పోరాడడం లాంటి అంశలతో డిమాన్ హంగామా చేశాడు.

మొత్తంగా, డిమాన్ పవన్ విన్నర్ టైటిల్ కన్నా రూ. 15 లక్షలను ఎంచుకోవడం తెలివైన నిర్ణయం అనిపిస్తోంది. బిగ్ బాస్ ఇంట్లో తన ఆట, ప్రవర్తనతో డిమాన్ ఈ సీజన్‌లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఈ నిర్ణయం అతని కెరీర్‌కు కొత్త మలుపు కావచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.