|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్‌బాస్-9: ఎట్టకేలకు అనుకున్నది సాధించిన తనూజ.. కప్ కూడా ఆమెకే ఇచ్చేయండి అంటున్న నెటిజన్లు

Published: 14-11-2025, 2:17 AM
బిగ్‌బాస్-9: ఎట్టకేలకు అనుకున్నది సాధించిన తనూజ.. కప్ కూడా ఆమెకే ఇచ్చేయండి అంటున్న నెటిజన్లు

బిగ్‌బాస్ సీజన్ 9లో పదోవారం రసవత్తరంగా మారింది. అనేక టాస్కుల్లో తీవ్రంగా పోరాడిన తనూజ ఎట్టకేలకు కెప్టెన్ పదవిని దక్కించుకుంది. ఈ విజయంతో ఆమె అభిమానులు సంతోషంగా ఉండగా, నెటిజన్లు సరదాగా కప్పు కూడా ఆమెకే ఇచ్చేయమని కామెంట్స్ చేస్తున్నారు.

Key Points

1

బిగ్‌బాస్ పదోవారం టాస్కులు, గెస్టులతో సందడిగా మారింది.

2

కెప్టెన్సీ టాస్కులో గెలిచి తనూజ బిగ్‌బాస్ రాజ్యానికి రాణిగా, పదోవారం కెప్టెన్‌గా మారింది.

4

తనూజ విజయంపై నెటిజన్లు స్పందిస్తూ, 'కప్ కూడా ఆమెకే ఇచ్చేయండి' అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్‌బాస్-9లో తనూజ గెలుపు రహస్యం

బిగ్‌బాస్ షోలో పదోవారం మరింత రజవత్తరంగా మారింది. టాస్కులు, గెస్టులతో హౌస్‌లో సందడి వాతావరణం నెలకొంది. తాజా విడుదలైన ప్రోమోలో.. బిగ్‌బాస్ రాజ్యానికి వారెవ్వా చెఫ్ వచ్చి అందరికీ కడుపునిండా భోజనం పెట్టాడు. ఇక ఇందులో కళ్యాణ్, నిఖిల్, రీతూ రాణిలుగా ఉండగా.. వారికి నాన్‌వెజ్ వంటకాలకు పెట్టాడు. తర్వాత కమాండర్స్ అయిన తనూజ(Tanuja), డిమాన్ పవన్(Diman Pawan), దివ్య(divya), సంజనకు వడ్డించారు. ప్రజలుగా ఉన్న సుమన్, భరణి, ఇమ్ము, వెజ్ ఫుడ్ మాత్రమే పెట్టాడు. ఆ తర్వాత రాజు, రాణిలు, కమాండర్స్‌తో పోటీపడాలని బిగ్‌బాస్ ప్రకటిస్తాడు. దీంతో కమాండర్స్‌లో తనూజ, దివ్య రాణిలుగా మారేందుకు కళ్యాణ్‌తో పోటీ పడేందుకు సిద్ధమవ్వగా బిగ్‌బాస్ ఓ గేమ్ పెడతాడు. అంతటితో ప్రోమో అయిపోగా.. ఈ గేమ్‌లో తనూజ విన్నర్‌గా నిలిచినట్లు తెలుస్తోంది.

ఇక ఇందులో తనూజ విన్నర్‌గా నిలిచి రాజు స్థానంలో నుంచి కళ్యాణ్‌ను కిందకు దింపి రాణిగా మారిపోయింది. బిగ్‌బాస్ రాజ్యానికి రాణి అవడంతో పాటు పదోవారంలో కెప్టెన్‌ అయినట్లు సమాచారం. ఇన్నాళ్లు కెప్టెన్ టాస్కుల్లో బాగా ఆడినప్పటికీ ఎన్నోసార్లు చేజారిపోయింది. ఇక పదోవారం మాత్రం ఎలాగైన కెప్టెన్ కావాలనుకుని కసితో ఆడిన తనూజ విన్నర్‌గా నిలిచింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఈ ప్రోమో చూసి ఇక కప్పు కూడా ఈ మహానటికే ఇవ్వండయ్యా.. అని కామెంట్లు పెడుతున్నారు. ఇంట్లోకి వెళ్లిన పదివారాలకు తనూజ కెప్టెన్ అవడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కెప్టెన్సీ కోసం తనుజ పడిన కష్టం

తనూజ విజయానికి నెటిజన్ల స్పందన

తనూజ తన పట్టుదలతో కెప్టెన్సీ సాధించి తన అభిమానులను మెప్పించింది. ఈ విజయం ఆమెకు ఆటలో మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని, కప్పు వైపు మరో అడుగు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.