|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ 9 తెలుగు: రీతూకు షాక్ తప్పదా? హౌస్ లో అలా.. బయట ఇలా.. తేడా కొడుతున్న ఓటింగ్.. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్?

Published: 24-09-2025, 12:16 AM
బిగ్ బాస్ 9 తెలుగు: రీతూకు షాక్ తప్పదా? హౌస్ లో అలా.. బయట ఇలా.. తేడా కొడుతున్న ఓటింగ్.. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్?

బిగ్ బాస్ 9 తెలుగులో మూడో వారం నామినేషన్స్ జరిగాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రీతూ చౌదరీ ఎలిమినేషన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమె హౌస్ లోని ప్రవర్తన, బయట వార్తలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి.

Key Points

1

బిగ్ బాస్ 9 తెలుగులో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అవకాశం.

2

రీతూ చౌదరీ ఎలిమినేషన్‌కు అవకాశం ఎక్కువగా ఉంది.

4

గౌతమి చేసిన ఆరోపణలు రీతూ ఓటింగ్‌పై ప్రభావం చూపాయి.

డబుల్ ఎలిమినేషన్ షాక్

బిగ్ బాస్ 9 తెలుగు మూడో వీక్ కు చేరుకుంది. ఈ సీజన్ మూడో వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే టాక్ ఆసక్తి రేపుతోంది. అయితే ఈ వీక్ రీతూకు షాక్ తప్పేలా లేదు. టాప్ కంటెండర్ అనుకున్న ఆమె ఈ వారం ఎలిమినేట్ అవుతుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ 9 తెలుగు మూడో వారం నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. రాము రాథోడ్, ఫ్లోరా సైని, హరిత హరీష్, కల్యాణ్ పడాల, రీతు చౌదరీ, ప్రియా శెట్టి నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లలో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో రీతు చౌదరీ కూడా ఉంటుందని అంటున్నారు.

రీతూ చౌదరీ భవిష్యత్తు

బిగ్ బాస్ 9 తెలుగులో ఫస్ట్ రెండు వారాల్లోనూ ఫ్లోరా సైని నామినేషన్లలో ఉంది. లాస్ట్ వరకూ వెళ్లింది. ఎలిమినేట్ అవుతుందేమో అనిపించింది. కానీ శ్రష్టి వర్మ, మర్యాద మనీష్ వెళ్లిపోయారు. ఈ వారంలోనూ నామినేషన్లలో ఉండటంతో ఫ్లోరా పనైపోయిందనే అనుకున్నారు. కానీ ఓటింగ్ లో ఆమె అదరగొడుతోంది. ఏకంగా టాప్-2 ప్లేస్ లోకి దూసుకెళ్లింది.

బిగ్ బాస్ 9 తెలుగు మూడో వారం ఓటింగ్ ప్రకారం చూసినా, ఆడియన్స్ అభిప్రాయాల ప్రకారం చూసినా రీతూ చౌదరీ కి కష్టమే అనిపిస్తోంది. ఓటింగ్ ప్రకారం చూస్తే రాము రాథోడ్ 26.78 శాతం, ఫ్లోరా సైని 26.11 శాతం ఓటింగ్ లో టాప్-2లో ఉన్నారు. పడాల కల్యాణ్ 13.49 శాతం,హరీష్ 13.41 శాతంతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. రీతు, ప్రియ ఏమో వరుసగా 11.9 శాతం, 8.31 శాతం ఓటింగ్ తో అయిదు, ఆరు ప్లేస్ ల్లో ఉన్నారు.

అభిమానుల ఓటింగ్

బిగ్ బాస్ హౌస్ లో ఇటు డీమాన్ పవన్, అటు పడాల కల్యాణ్ తో రీతు క్లోజ్ గా ఉంటుంది. ఇక గత వారం అయితే పవన్ ను కెప్టెన్ ను చేసేందుకు ఎంత చేయాలో అంత చేసిందని చూశాం. కానీ పవన్ మాత్రం నామినేషన్స్ నుంచి రీతును సేవ్ చేయలేదు. ఇక బయట టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ భార్య గౌతమి రీతుపై సంచలన ఆరోపణలు చేసింది.

రీతు, తన భర్త కలిసి అర్ధరాత్రుల్లో ఫ్లాట్ లోకి చాలా సార్లు వెళ్లారని సీసీ ఫుటేజీలతో సహా గౌతమి బయటపెట్టింది. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. ఇది రీతు ఓటింగ్ పై కూడా పెను ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో ఈ వారం బిగ్ బాస్ 9 తెలుగు హౌస్ నుంచి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంటారు. అదే జరిగితే ప్రియా శెట్టితో పాటు రీతు కూడా బయటకు వెళ్లడం ఖాయమే.

బిగ్ బాస్ హౌస్ లో రీతూ చౌదరీ భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది. ఓటింగ్ ఫలితాలు ఆమెకు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఆమె బయటకు వెళ్ళే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.