|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss 9 Telugu: నామినేషన్లలో ఈసారి ఆరుగురు.. ఒక్కరు మాత్రం!

Published: 30-09-2025, 5:46 AM

బిగ్‌బాస్ 9 తెలుగు మూడో వారం ముగిసింది. ఆదివారం ప్రియ ఎలిమినేట్ కావడంతో, ఈ వారం నామినేషన్లపై ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారిలో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు హౌస్ వీడతారో అన్నది ఆసక్తికరంగా మారింది.

Key Points

1

బిగ్‌బాస్ 9 తెలుగు 3వ వారం పూర్తయింది. కామనర్ ప్రియ ఎలిమినేట్ అయ్యింది.

2

తనూజ, సుమన్ శెట్టి ఇమ్యూనిటీ గెలిచి నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు.

4

శ్రీజ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్య ఎలిమినేషన్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు అంచనా.

నామినేషన్ ప్రక్రియలో కొత్త ట్విస్ట్

బిగ్‌బాస్ 9 మూడు వారాలు పూర్తయింది. ఆదివారం ఎపిసోడ్‌లో కామనర్ ప్రియ ఎలిమినేట్ అయింది. దీంతో ఈసారి ఎవరు నామినేషన్స్‌లోకి వస్తారా? అని అనిపించింది. కానీ బిగ్‌బాస్ మాత్రం సోమవారం ఈ ప్రక్రియ పెట్టకుండా ఇమ్యూనిటీ కోసం గేమ్స్ ఆడిపించాడు. ఇందులో తనూజ, సుమన్ శెట్టి గెలిచి.. నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయారు. కెప్టెన్ పవన్ ఎలానూ ఈ ప్రక్రియలో ఉండడు. మరి ఈ ముగ్గురు కాకుండా ఎవరెవరు నామినేషన్స్ లిస్టులో ఉన్నారు?

నామినేషన్ ప్రక్రియని ఈసారి కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ముగ్గురు చొప్పున మూడు జట్లగా విడగొట్టి వాళ్లతో గేమ్ ఆడిపించారు. ముగ్గురికి కలిపి ఓ ఎలస్టిక్ తాడు ఉంటుంది. దీని సహాయంతో హౌస్‌లో ఉన్న ఓ వస్తువుని చేతులతో తాకకుండా కింద పడకుండా తీసుకొచ్చి బయట లాన్‌లో పెట్టాల్సి ఉంటుంది. గెలిచిన టీమ్ నుంచి ఒకరు వచ్చి ఓడిపోయిన జట్లలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు.

డేంజర్ జోన్‌లో శ్రీజ, దివ్య

అలా రెండుసార్లు ఎల్లో టీమ్ గెలిచింది. దీంతో ఈ జట్టులోని సుమన్ శెట్టి, రీతూని నామినేట్ చేశాడు. రాము.. సంజనని నామినేట్ చేశాడు. మొత్తంగా చూస్తే ఈ వారం ఆరుగురు నామినేట్ అయ్యారు. రీతూ, సంజన, హరీశ్, ఫ్లోరా, శ్రీజ, దివ్య ఉన్నారు. వీళ్లలో దివ్య గతవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌసులోకి వచ్చింది. శ్రీజ కూడా గతవారం నామినేట్ అయింది కానీ కెప్టెన్ పవన్ సేవ్ చేయడంతో బయటపడింది. ఈసారి మాత్రం నామినేషన్స్ నుంచి తప్పించుకోలేకపోయింది.

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

అయితే నామినేషన్స్ లిస్ట్ చూస్తే ఈసారి శ్రీజ బయటకొచ్చేయడం గ్యారంటీ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే దివ్య కాకుండా మిగిలిన నలుగురు ఇప్పటికే నామినేషన్స్‌లోకి వచ్చి సేవ్ అయ్యారు. కాబట్టి వాళ్లకు ఓటు బ్యాంక్ బాగానే ఉంది. అలానే గతవారం వచ్చిన దివ్యపై ఆడియెన్స్‌లో కాస్త పాజిటివిటీ ఉండొచ్చు. అయినా సరే ఈమె కూడా శ్రీజతో పాటు డేంజర్ జోన్‌లో ఉండొచ్చు. మరి ఈ వీకెండ్ ఏం జరుగుతుందో? ఎవరు ఔట్ అవుతారో చూడాలి?

ఈ వారం నామినేట్ అయినోళ్లు

బిగ్‌బాస్ 9 తెలుగులో ఈ వారం ఆరుగురు నామినేట్ అయ్యారు. శ్రీజ, దివ్యలు డేంజర్ జోన్‌లో ఉండగా, ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. వీకెండ్ ఎపిసోడ్‌లో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.