
📌 Key Points
- బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది దశకు చేరుకుంది.
- డబుల్ ఎలిమినేషన్ లో స్ట్రాంగ్ ప్లేయర్ భరణి ఇంటి నుంచి ఔట్ అయ్యాడు.
- టాప్ 5లో తనూజ, కళ్యాణ్, డెమోన్ పవన్, సంజన, ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.
- విన్నర్ టైటిల్ కోసం తనూజ, కళ్యాణ్ మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తో స్ట్రాంగ్ ప్లేయర్ భరణి ఇంటి నుంచి ఔట్ అయ్యాడు. ఇక టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు? విన్నర్ టైటిల్ కోసం ఎవరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్: ఔట్ అయిన స్ట్రాంగ్ ప్లేయర్
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9 Telugu)చివరి దశకు చేరుకుంది. ఇంకా ఒకవారంలో ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఈ వారం హోస్ట్ నాగార్జున కూడా హౌస్ మేట్స్‌కు షాక్ ఇచ్చారు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ముందే ప్రకటించాడు. ఇప్పటికే, శనివారం జరిగిన ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వగా ఆదివారం నాడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తనూజ, కళ్యాణ్, డెమోన్ పవన్, సంజన, భరణి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వీరిలో, సంజన-భరణి మధ్య టఫ్ ఫైట్ జరిగినట్టు తెలుస్తోంది. చివరకు ఆదివారం నాటి ఎపిసోడ్ లో భరణి ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది.
Srikanth Odela: సెట్స్ లో అతనొక ‘మాన్స్టర్’.. శ్రీకాంత్ ఓదెల బర్త్ డే స్పెషల్ వీడియో..
ఫైనల్ రేసులో బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్
నిజానికి, భరణి ఇదివరకే ఇంటినుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఆ తరువాత పలు కరణాల వల్ల మళ్ళీ లోపలి ఎంట్రీ ఇచ్చాడు భరణి. అంతకుముందు రిలేషన్స్ అంటూ పాకులాడిన భరణి ఆ తరువాత కాస్త మారి ఆటను కొత్తగా మొదలుపెట్టాడు. కానీ, ఆడియన్స్ మాత్రం అతడిని రిజెక్ట్టెడ్ కంటే స్టెంట్ గానే చూశారు. అందుకే, టాప్ 5లో సంజనాని ఛాన్స్ ఇచ్చి భరణిని బయటకు పంపేశారు ఆడియన్స్. ఇక ఇంతకాలం చాలా క్లోజ్ గా ఉన్న ఉన్న భరణి- సుమన్ ఒకేవారం ఎలిమినేట్ కావడం విశేషం. ఇక వీరికి సంబందించిన స్పెషల్ వీడియోను కూడా ప్లే చేశాడు నాగార్జున. ఆ వీడియో చూసి ఇద్దరు ఎమోషనల్ అయ్యారు కూడా.
బిగ్ బాస్ 9 విన్నర్ టైటిల్ కోసం తీవ్ర పోటీ
ఇక టాప్ 5 విషయానికి వస్తే, తనూజ, కళ్యాణ్, డెమోన్ పవన్,సంజన,ఇమ్మాన్యుయేల్ ఉన్నారు. వీరిలో దాదాపు ఎవరికీ వారు చాలా బలంగా ఉన్నారు. కానీ, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే టాప్ 3లో తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ ఉండే అవకాశం ఉంది. ఇక విన్నర్ పోటీగా తనూజ, కళ్యాణ్ మధ్య చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. వోటింగ్ కూడా ఈ ఇద్దరి మధ్యలోనే అన్నట్టుగా ఉంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారు అనేది తెలియాలంటే మరోవారం ఆగాల్సిందే.
బిగ్ బాస్ 9 చివరి దశలో తనూజ, కళ్యాణ్ ల మధ్య టైటిల్ కోసం తీవ్ర పోటీ నడుస్తోంది. మరి ఈ సీజన్ విజేత ఎవరు అవుతారో తెలియాలంటే మరో వారం వేచి చూడాల్సిందే. అన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


