|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ నామినేషన్ ట్విస్ట్.. సంజనను టార్గెట్ చేసిన ఓనర్స్.. అలాంటి పదాలు వాడొద్దంటూ ప్రియకు వార్నింగ్

Published: 09-09-2025, 12:46 AM
బిగ్ బాస్ నామినేషన్ ట్విస్ట్.. సంజనను టార్గెట్ చేసిన ఓనర్స్.. అలాంటి పదాలు వాడొద్దంటూ ప్రియకు వార్నింగ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో నామినేషన్ ప్రక్రియలో అనూహ్య ట్విస్ట్. ఓనర్స్ గ్రూప్ సంజన గల్రానీని టార్గెట్ చేయగా, ప్రియ వ్యాఖ్యలపై సంజన తీవ్రంగా స్పందించింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

Key Points

1

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఓనర్స్, టెనెంట్స్ మధ్య తీవ్రమైన పోటీ.

2

నామినేషన్స్ లో సంజన గల్రానీని టార్గెట్ చేసిన ఓనర్స్.

4

ఓనర్స్ మరియు టెనెంట్స్ మధ్య వైరుధ్యాలు, గొడవలు.

ఓనర్స్ మరియు టెనెంట్స్ మధ్య పోరు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఓనర్స్, టెనెంట్స్ మధ్య పోరు జోరు అందుకుంది. నామినేషన్స్ లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ రోజు సెలబ్రిటీ ఇమ్మాన్యుయేల్, కామనర్ మాస్క్ మ్యాన్ హరీష్ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. రెండో రోజు టెనెంట్స్ గ్రూప్ లోని సంజన గల్రానీని ఓనర్లు టార్గెట్ చేశారు. సెకండ్ డే ఫస్ట్ ప్రోమోలో ఇది క్లారిటీగా కనిపించింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఫస్ట్ నామినేషన్స్ స్టార్ట్ అయింది. నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్లు ఫైర్ మీద ఉంటారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఇప్పటికే కామనర్స్ కలిసి ఓనర్లుగా, సెలబ్రిటీలు కలిసి టెనెంట్స్ గా రెండు గ్రూపులుగా ఉన్నారు. ఇక ఈ సారి గ్రూప్ ల మధ్య పోరు ఏ లెవల్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకు తగ్గట్లుగానే సెకండ్ డే ప్రోమో 1ను వదిలారు మేకర్స్.

సంజనను టార్గెట్ చేసిన నామినేషన్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఫస్ట్ నామినేషన్స్ లో భాగంగా ఓనర్స్ అందరూ కలిసి టెనెంట్స్ లో ఒకరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. అదే మీకు లభించే ప్రయోజనమని అంటాడు. అప్పుడు ఓనర్స్ అందరూ బెడ్ రూమ్ లోకి వెళ్లి డిస్కస్ చేస్తారు. నామినేట్ పాయింట్ క్లియర్ గా ఉండాలని దమ్ము శ్రీజ చెప్తుంది. ఒక్కొకరు ఒక్కో పేరు చెప్పండని, ఫైనలైజ్ చేద్దామని అంటుంది.

ఓనర్స్ అందరూ కలిసి సంజన గల్రానీని నామినేట్ చేయాలనుకుంటారు. మర్యాద మనీష్ ఈ విషయాన్ని వెల్లడిస్తాడు. మేమందరం కలిసి యునానిమస్ గా సంజన నేమ్ అనుకున్నాం. మీ వల్ల వేరే ప్లేయర్లు కూడా హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఏదో ఒక మాట అనేయాల్సి వస్తుంది. మిస్ అండర్ స్టాండింగ్ స్టార్ట్ అవుతుందని మనీష్ అంటాడు. మీరు అబద్ధాలు ఆడుతున్నారని అంటాడు.

ప్రియకు వార్నింగ్

ఆరుగురిలో నాకు ఎవరైనా చెప్పారా వాటర్ తాగడానికి ఇంట్లోకి వస్తే పర్మిషన్ కావాలాని? అని ప్రశ్నిస్తుంది సంజన. బిగ్ బాస్ చెప్పాడని ప్రియ అనడంతో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. బ్యాక్ బిచింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అని ప్రియ అంటే.. ఆ వర్డ్ వాడినందుకు సంజన సీరియస్ అవుతుంది. అలాంటి వర్డ్ వాడొద్దని వార్నింగ్ ఇస్తుంది.

ఆ తర్వాత బ్యాక్ బిచింగ్ అనేదానిపై సంజన, ఆషా షైనీ మాటలనుకుంటారు. నేను ఓల్డ్ స్కూల్, నాకొద్దు ఆ వర్డ్స్ అని సంజన అంటుంది. మూడు సార్లు నా రిలేషన్ గురించి ఎందుకు మాట్లాడారని ఆషా ప్రశ్నిస్తుంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో నామినేషన్స్ తో పాటు, ఓనర్స్ మరియు టెనెంట్స్ మధ్య పెరిగిన వైరుధ్యాలు, గొడవలు కథనంలో చర్చించబడ్డాయి. సంజన మరియు ప్రియ మధ్య ఘర్షణ ముఖ్యమైన విషయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.